Breaking News

అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్‌ చేస్తే తీసేస్తారు: అషూ

Published on Sat, 03/07/2026 - 16:54

టిక్‌టాక్‌ ద్వారా జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్‌ స్మాష్‌, రీల్స్‌తో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లోనూ పాల్గొని మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

ఇప్పటివరకు ఎన్నో చేశా..
ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ విన్నర్‌ నిఖిల్‌ మళయక్కల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. తాజాగా విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ ప్రెస్‌మీట్‌లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్‌ పర్ఫామెన్స్‌లు, క్యారెక్టర్‌ రోల్స్‌, హోస్టింగ్‌.. ఇలా అన్నీ చేశాను. 

హీరోయిన్‌ అంటుంటే..
తొలిసారి హీరోయిన్‌గా చేశాను. షూటింగ్‌లో అందరూ హీరోయిన్‌గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్‌ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్‌గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.

ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా..
అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా ప్రొడక్షన్‌ హౌస్‌ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్‌లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్‌ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్‌కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్‌ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.

చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే?

Videos

ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?

సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?

ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా

10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి

లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు

ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!

భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్

విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

Photos

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)