Breaking News

చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?

Published on Fri, 03/06/2026 - 17:54

హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన ఈమె.. తర్వాత రిసెప్షన్స్‌లో పాల్గొంటూ బాగానే సందడి చేసింది. ఓ వారం గ్యాప్ తీసుకుని 'రణబాలి' షూటింగ్‌లో భార్యభర్తలిద్దరూ పాల్గొంటారు. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇలా ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)

'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక కలిసి నటించారు. రష్మికకు హీరోయిన్‌గా ఇదే తొలి మూవీ. దీని షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ పెళ్లి రద్దు చేసుకున్నారు. అ‍ప్పటి నుంచి కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీ అయిపోయారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజుకి వెళ్లిపోయింది. అలా విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

మరోవైపు రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు. అప్పుడెప్పుడో 2023లో 'సప్త సాగర ఎల్లో దాచే' అనే సినిమా రెండు భాగాలతో వచ్చాడు. తర్వాత నుంచి కొత్తగా మరో మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇతడు స్నేహితుడు రిషభ్ శెట్టి.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం రక్షిత్.. అమెరికాలో ఉన్నాడని, కొత్త సినిమా కోసం స్టోరీ రాసుకుంటున్నాడని అన్నాడు. తాజాగా రక్షిత్ శెట్టి.. ఫేస్‌బుక్‌లో తన 'చార్లీ' మూవీకి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఇతడి అభిమానులు.. రష్మిక పెళ్లిని లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి రక్షిత్, సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉన్నట్లుండి ఇప్పుడీ ఫొటో పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషభ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్‍‌లోనూ నటించబోతున్నాడు. మరో స్నేహితుడు రాజ్ బి శెట్టి కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ నటుడిగా పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రక్షిత్ మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించక, నిర్మాతగానూ కొత్త చిత్రాలేం చేయక సైలెంట్ అయిపోవడం అతడి ఫ్యాన్స్‌ని ఆలోచనలో పడేసింది.

(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

Videos

ఏ దేశంలో ఎన్ని అణుబాంబులున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా

పావలా శ్యామలకు బన్నీ భరోసా..!

UPSC సివిల్స్ ఫలితాలు విడుదల టాపర్స్ వీళ్లే

బ్లూ స్పేరోతో ఖమేనీపై దాడి ఇజ్రాయెల్ కీలక ప్రకటన..

భీకర యుద్ధం.. ఇరాన్ గుండెల్లో బాంబుల వర్షం

ఈనెల 11 నుంచే ప్రభుత్వ సంస్థ.. ఏకంగా రూ.6000 కోట్లు.. రెడీగా ఉండండి..

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి

11 మంది 1100 మందితో సమానం..! YSRCP పై పవన్ షాకింగ్ వ్యాఖ్యలు

ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత

పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?

Photos

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌ (ఫొటోలు)

+5

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)