₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
వార్ ఎఫెక్ట్.. భారత్‌కు తప్పని ఇబ్బందులు!
Published on Thu, 03/05/2026 - 18:12
అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా దేశాలతోపాటు.. భారతీయ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన బాస్మతి బియ్యం.. ఇప్పుడు ఢిల్లీలోని గిడ్డంగుల్లో నిలిచిపోయింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి.
ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోవడం అనేది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం ఓడరేవులు, గిడ్డంగుల్లో ఉన్నట్లు సమాచారం. సుమారు 2,00,000 టన్నుల బాస్మతి బియ్యం రవాణాలో చిక్కుకుపోయినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (AIREA) అధ్యక్షుడు సతీష్ గోయెల్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు ఇప్పటికే స్టాక్‌లను పోర్టులకు తరలించారు, కానీ పెరుగుతున్న కంటైనర్ సరుకు రవాణా ఖర్చుల కారణంగా మధ్యప్రాచ్యానికి రవాణా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.
భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కలిగిన, ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే అతిపెద్ద దేశం. మన దేశం సౌదీ అరేబియా, ఇరాన్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా మధ్యప్రాచ్యంలో సగానికి పైగా వాటా కలిగి ఉంది.
తగ్గిన ధరలు
2026 ప్రారంభం నుంచి బాస్మతి బియ్యం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో మాత్రమే ధరలు 5-10 శాతం పెరిగాయి. కాగా ఇప్పుడు యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లకు రవాణా నిలిచిపోయింది. దీంతో ధరలు 10 శాతం పడిపోయింది. మన దేశంలో కూడా బాస్మతి బియ్యం రేటు 5-6 శాతం తగ్గింది. యుద్ధం ముగిస్తేగానీ.. మళ్లీ ఎగుమతులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎగుమతులు మొదలైతే ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
Tags : 1