₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
Published on Thu, 03/05/2026 - 15:51
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.
ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్‌ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్‌జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణం
భారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్‌లో కొనుగోళ్లు పెంచారు.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
Tags : 1