₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్
Published on Thu, 03/05/2026 - 09:38
బండ్ల గణేశ్ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి పలు చిత్రాలు నిర్మించాడు. దాదాపు దశాబ్దకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. బీజీ బ్లాక్‌బస్టర్స్ పేరుతో రెండో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.
అంత టైం లేదు
తాజాగా ఈయన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రయూనిట్‌తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ చేసే సమయం లేదు. నాదగ్గర వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను షూటింగ్స్‌కు వెళ్లి యాక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం దెబ్బతింటుంది.
చిరంజీవి సినిమాలో..
కాకపోతే నా మనసుకు నచ్చి ఈ వేషం నేను వేయాల్సిందే అనిపించిన రోల్స్ మాత్రం స్వీకరిస్తాను. ఇప్పుడు చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. నాకు ఓ వేషం వేయాలని కోరిక ఉంది. అది నా బ్యానర్‌లోనే నిర్మించి ఆ రోల్ నేనే చేస్తాను, కచ్చితంగా సూపర్ హిట్ కొడతాను అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి- బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనే బండ్ల గణేశ్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్
Tags : 1