₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
'రైరై రారా' పాట రాసేందుకు 2 నెలలు: అనంత శ్రీరామ్
Published on Thu, 03/05/2026 - 08:09
ఒక మంచి పాట రాయడం, మాస్ పాట రాయడం అనేది కష్టం కాదు. కానీ, పెద్ది సినిమా కోసం రై రై రా రారా.. పాటలో మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తిమీద సాములా అనిపించింది. రెహమాన్ గారి బాణీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది అని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలిపారు.
పెద్ది సెకండ్ సాంగ్
రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి రై రై రారా.. అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేశారు.
అదే జరిగితే..
ఈ పాట రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌గారి రుద్రతాండవం, రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలుగారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా రై రై రారా.. పాటలోని లిరిక్స్ బాగున్నాయి అనడం.. సాహిత్యానికి ప్రశంసలు రావడం ఆనందాన్నిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఆ ఆలోచన విరమించుకునేలా నా పాట స్ఫూర్తి నింపితే నా రచన సార్థకమైనట్లే అని చెబుతుంటాను. ఆ లక్షణం ఈ పాటకు ఉంది అని చెప్పాడు.
Tags : 1