బ్లాక్‌బస్టర్‌ 'గీత గోవిందం'ను మిస్‌ చేసుకున్నా: హీరోయిన్‌

Published on Wed, 03/04/2026 - 22:17

ఎనిమిదేళ్ల క్రితం రష్మిక మెడలో తాళి కడుతుంటే విజయ్‌కు చేతులు వణికాయి. కానీ ఇప్పుడు భయం, బెరుకు ఏదీ లేదు.. మనసంతా గాల్లో తేలుతోంది. చుట్టూ ఉన్న వాతావరణమంతా ప్రేమమయంగా మారింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్‌- రష్మిక రీల్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్‌ చూసి సగటు ప్రేక్షకుడు మురిసిపోయాడు.

ఆ సినిమాతో పునాది
ఇప్పుడూ అంతే.. రియల్‌ లైఫ్‌లో విజయ్‌- రష్మిక ఒక్కటైనందుకు ప్రేక్షకలోకం సంతోషంగా శుభాకాంక్షలు చెప్తోంది. కలకాలం కలిసి జీవించమని దీవిస్తోంది. వీరి ప్రయాణానికి పునాది పడింది గీత గోవిందం సినిమాతోనే! పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. డియర్‌ కామ్రేడ్‌ మూవీ చేస్తున్న టైంలోనే స్నేహం ప్రేమగా మారగా.. ఫస్ట్‌ రష్మికనే లవ్‌ ప్రపోజ్‌ చేసింది. 

గీత గోవిందం ఫస్ట్‌ ఛాయిస్‌ రష్మిక కాదు
అలా ఈ ఏడడుగల బంధానికి తొలి అడుగు పడింది. అయితే గీత గోవిందం సినిమా ఆఫర్‌ రష్మిక కంటే ముందు చాలామంది హీరోయిన్స్‌కు వెళ్లిందట! వారిలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కూతురు ఐశ్వర్య ఒకరు. ఈమె ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు తనకు తెలుగులో గీత గోవిందం ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి.

సినిమా
తెలుగులో 'గీత గోవిందం' కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. ఐశ్వర్య.. గీత గోవిందం పోగొట్టుకున్నప్పటికీ సీతా పయనం మూవీతో మంచి డెబ్యూ అందుకుంది. అటు రష్మికకు.. గీత గోవిందం కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగానూ బాగా కలిసొచ్చింది.

చదవండి: కొత్త కోడలు వచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్‌ దేవరకొండ

Videos

విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి

ఒక పశువులాగా.. క్లాస్ రూమ్ లోనే..! న్యూడ్ వీడియోలు తీసి..!

జయలలితే నాకు ఇన్స్పిరేషన్.. స్త్రీ గొప్పతనం చాటేలా “సరస్వతి" సినిమా

మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు

ఇరాన్ తో యుద్ధం.. బెడిసికొట్టిన అమెరికా ప్లాన్ పెంటగాన్ సంచలన రిపోర్ట్

BJP చేతికి బీహార్ సీఎం పోస్ట్ నితీష్ కుమార్ గుడ్ బై!

యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

పీఎం రాహత్ స్కీమ్... ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం కడుతుంది

ఇరాన్‌ తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం

Photos

+5

విరోష్ జంట రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

#Virosh Reception: ఘనంగా విజయ్‌- రష్మిక రిసెప్షన్‌ (ఫోటోలు)

+5

'పీలింగ్స్‌..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)

+5

అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

ఆకుపచ్చ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియమణి (ఫొటోలు)

+5

ఇది నా జర్నీ కాదు మనది.. మంచు మనోజ్-మౌనిక పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

‘సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)