యుద్ధ భయాలు.. మార్కెట్‌లో నీలినీడలు

Published on Wed, 03/04/2026 - 09:23

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.15

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.2 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.94 శాతం నష్టపోయింది.

  • నాస్‌డాక్‌ 1.02 శాతం దిగజారింది.

అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్‌ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. అటు ఆసియా, యూరప్‌ సూచీలు కూడా భారీగా తగ్గాయి.

దక్షిణ కొరియా కోస్పి స్టాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్‌ నిల్వలున్నప్పటికీ జపాన్‌ నికాయ్‌ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు.

అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 82.2 డాలర్ల వద్ద, నైమెక్స్‌ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్‌ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

Today Nifty position 04-03-2026(time: 9:22 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి

ఒక పశువులాగా.. క్లాస్ రూమ్ లోనే..! న్యూడ్ వీడియోలు తీసి..!

జయలలితే నాకు ఇన్స్పిరేషన్.. స్త్రీ గొప్పతనం చాటేలా “సరస్వతి" సినిమా

మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు

ఇరాన్ తో యుద్ధం.. బెడిసికొట్టిన అమెరికా ప్లాన్ పెంటగాన్ సంచలన రిపోర్ట్

BJP చేతికి బీహార్ సీఎం పోస్ట్ నితీష్ కుమార్ గుడ్ బై!

యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

పీఎం రాహత్ స్కీమ్... ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం కడుతుంది

ఇరాన్‌ తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం

Photos

+5

విరోష్ జంట రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

#Virosh Reception: ఘనంగా విజయ్‌- రష్మిక రిసెప్షన్‌ (ఫోటోలు)

+5

'పీలింగ్స్‌..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)

+5

అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

ఆకుపచ్చ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియమణి (ఫొటోలు)

+5

ఇది నా జర్నీ కాదు మనది.. మంచు మనోజ్-మౌనిక పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

‘సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)