ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం
Breaking News
యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Published on Sun, 03/01/2026 - 13:44
కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్. ఇటీవలే టీజర్, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.
కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Tags : 1