Breaking News

'ది కేరళ స్టోరీ 2' కలెక్షన్స్‌.. దేశవ్యాప్తంగా ఎవరూ పట్టించుకోలేదా?

Published on Sun, 03/01/2026 - 13:32

‘ది కేరళ స్టోరీ’కి కొనసాగింపుగా  ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఫిబ్రవరి 27న విడుదలైంది. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ఓపెనింగ్ కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. కేర‌ళ హైకోర్టు ఈ చిత్రాన్ని  ఆపివేయాల‌ని ఆదేశించినప్పటికీ డివిజ‌న్ బెంచ్ ద్వారా అనుమ‌తి పొంది విడుద‌లైంది. అయితే రంజాన్ మాసంలో ఈ మూవీ విడుదల కావడంతో ముస్లిమ్స్‌ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేరళ రాష్ట్రం అన్ని మతాల ఐఖ్యతకు మూలం అని ఈ చిత్రం ఒక కల్పితం మాత్రమే అంటూ  పలు వీడియోలను నెటిజన్లు షేర్‌ చేశారు.

'ది కేరళ స్టోరీ 2' మొదటి రెండురోజుల్లో కేవలం రూ. 5.4 కోట్లు మాత్రమే రాబట్టింది. అత్యధికంగా ముంబైలో సుమారు 800 స్క్రీన్స్‌లలో ఈ మూవీని ప్రదర్శించగా కేవలం 12 శాతం మాత్రమే టికెట్ల అమ్మకాలు జరిగాయి.  దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించడంతో మేకర్స్‌ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 836 షోలకు గాను 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. హైదరాబాద్ 11.75%, బెంగళూరు 12%, చెన్నై 15 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. 2023లో వచ్చిన  'ది కేరళ స్టోరీ'  ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, సీక్వెల్‌ కలెక్షన్స్‌ ఆ రేంజ్‌ మార్క్‌ను అందుకోవడం అసాధ్యమైన పని అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

Videos

దుబాయ్ లో హైటెన్షన్ బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి

చీకటి శకం ముగిసింది ఇరాన్ వీధుల్లో సంబరాలు

రేవంత్ తో చంద్రబాబు కుమ్మక్కు.. రాయలసీమ ప్రాజెక్టుపై సజ్జల డిమాండ్స్

ఖమేనీ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్

పులకేష్ ని మైమరిపిస్తున్న లోకేష్

BR నాయుడు 30 ఏళ్ల బంధం చాలా బలమైనది: పేర్ని నాని

మియాపూర్ లో అపోలో ఫార్మసీ 1000వ స్టోర్‌ ను ప్రారంభించిన ఉపాసన

సాక్షి మీడియాకి సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

దుబాయ్ లో బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా మీదుగా ఇరాన్ మిస్సైల్స్

రాష్ట్ర ప్రజల్ని రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పడేసాడు..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)

+5

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)

+5

శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)

+5

ఇరాన్‌: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)

+5

మహిళ కబడ్డీ మూవీ ప్రెస్‌ మీట్ (ఫొటోలు)

+5

విష్ణు విన్యాసం మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సన్‌ ఆఫ్‌ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)

+5

లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)