పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ
Breaking News
ఘట్టమనేని జయకృష్ణ సినిమాలో మోహన్ బాబు.. లుక్ అదిరింది!
Published on Sat, 02/28/2026 - 12:19
‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ నటి రాషా తడాని తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా ఆయన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ పోస్టర్‌లో మోహన్ బాబు సాధారణ తెల్లటి కుర్తా-ధోతీ ధరించి పవర్ ఫుల్‌గా, గంభీరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మోహన్ బాబు నటించినట్లు తెలుస్తుంది. చాలాకాలం తర్వాత మోహన్ బాబు మళ్లీ ఇలాంటి పాత్రలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోనూ మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నాడు.
Introducing the Legendary @themohanbabu garu as “VENKATAPPAYA NAIDU” from #SrinivasaMangapuram❤️🔥
Brace yourselves for his towering performance in a role carved with power and pride💥
An @DirAjayBhupathi Film 🔥 pic.twitter.com/JvGBr9JGg4— Chandamama Kathalu Pictures (@CKPicturesoffl) February 28, 2026
Tags : 1