Breaking News

మార్కెట్‌కు సోలార్‌ సెగ 

Published on Thu, 02/26/2026 - 05:34

ముంబై: భారతీయ సౌర విద్యుత్‌ పరికరాల దిగుమతులపై 126 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటనతో దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఇంట్రాడే గరిష్టాల నుంచి వెనుదిరిగిన స్టాక్‌ సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 732 పాయింట్లు బలపడి సెన్సెక్స్‌ చివరికి 50 పాయింట్ల పరిమిత లాభంతో 82,276 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 25,483 వద్ద ముగిసింది. 

ఒక దశలో 228 పాయింట్లు ఎగసి 25,653 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఏఐ సంబంధిత ఆందోళనలు కొద్దిగా తగ్గడంతో అమెరికా టెక్‌ షేర్లు పుంజుకున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సరళతర ద్రవ్య విధాన వైఖరి సంకేతాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

→ మెటల్, ఆటో, కమోడిటీస్, ఫార్మా, కన్జూమర్‌ డిస్క్రేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్సు 0.59%, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.37 శాతం పెరిగాయి.  

షేర్లు షివర్‌!
భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే సౌర ఉత్పత్తులపై అమెరికా 126% సుంకం విధింపు తర్వాత దేశీయ సోలార్‌ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.‘భారత సోలార్‌ తయారీ సంస్థలు యూఎస్‌ ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు పొందుతూ.., అమెరికాలోని స్థానిక తయారీదారులకు తీవ్రతర పోటీగా మారి వారి లాభాలకు గండి కొడుతున్నాయని విచారణలో తేలింది. 

ఈ కారణంతోనే భారీ పన్నులు విధించాల్సి వచి్చంది’ అని అమెరికా వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.  అత్యధికంగా వారీ ఎనర్జీస్‌ 10.47% పతనమై రూ. 2709 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14.99% క్షీణించింది.  ప్రీమియర్‌ ఎనర్జీస్‌ 6.27% నష్టపోయి రూ.729 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14.33% పతనమైంది. విక్రమ్‌ సోలార్‌ 5.45% పడిపోయి రూ.175 వద్ద నిలిచింది.
 

Videos

Komarada Nagavali River:ఇంటర్ విద్యార్థులకు నది దాటడమే ఓ పరీక్ష

మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ

సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు

Hyd: షాపింగ్ మాల్‌కు టెంపుల్ సెట్ వేయడంతో భారీగా వ్యాపించిన మంటలు

9 ఏళ్ల బాలికకు హార్ట్ ఎటాక్! ప్లే గ్రౌండ్ లో కుప్పకూలి చనిపోయిన చిన్నారి

రఘురామను అరెస్ట్ చేయాలి.. IPS PV సునీల్ కుమార్ సంచలన ట్వీట్

Nellore: కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠంపై సుప్రీంకోర్టు సీరియస్

లడ్డూపై చర్చ జరుపుతామని మాట మార్చిన ప్రభుత్వం

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)