బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!
Breaking News
పవన్‌ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్!
Published on Wed, 02/25/2026 - 10:29
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కల్యాణ్‌ని విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పవన్ గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఓ బాంబ్ పేల్చింది. ఈసారి ఏకంగా పవన్ మతం, పిల్లలని క్రైస్తవంలోకి మార్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్)
'మూడు నెలల వయసున్నప్పుడే విదేశాలకు తీసుకెళ్లి పిల్లలకు బాప్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ కైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండటం అంటే కేవలం రాజకీయ డ్రామా కోసమే ఆ దుస్తులు ధరిస్తున్నారా?' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. నేరుగా ఎటాక్‌కి దిగారుగా అని ఓ నెటిజన్ రీట్వీట్ చేయగా.. ఇది ఎటాక్ కాదని, తనకు వచ్చిన ఓ సందేహం మాత్రమేనని పూనమ్ చెప్పుకొచ్చింది. పేరు చెప్పనప్పటికీ.. పూనమ్ ప్రస్తావించింది పవన్ గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలోనే.. రాజకీయ లబ్ది కోసం ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే కోణంలోనే పూనమ్ ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
(ఇదీ చదవండి: నంది అవార్డులని పందులతో పోల్చిన తెలుగు నిర్మాత)

.
Tags : 1