Breaking News

కుక్క మొరగడంతోనే.. పెళ్లి ఆగిపోయింది..! ట్విస్ట్‌ ఏంటంటే..

Published on Mon, 02/23/2026 - 17:19

కొన్ని ఘటనలు చాలా సిల్లీగా ఉంటాయి. మనుషులు కూడా..చిన్న చిన్న  విషయాలను పెద్దవిగా చూడటం వల్లనో అపార్థం చేసుకోవడం వల్లనో.. క్షణాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి..చంపుకునేంత వరకు వెళ్లిపోతోంది పరిస్థితి. ఇక్కడ కూడా అచ్చం అలానే చోటుచేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో సరదాగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం జస్ట్‌ ఓ కుక్క కారణంగా ఘర్షణ వాతావరణంగా మారి ఏకంగా పెళ్లే ఆపేసేందుకు దారితీసింది. 

అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో జరిగిన వివాహ వేడుక కుక్క కారణంగా హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దివంగత సునీల్ కుమార్ , సరోజ్‌ గుప్తాల కుమార్తె తాన్య కేషర్వాణి, దివంగత రాకేష్‌ చందా, బాబ్లీదేవి కుమారుడు సుమిత్‌లు ఇంటి నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ నెల ఫిబ్రవరి 18న ఫతేపూర్‌ అధికారిక వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. 

పెళ్లి తంతులో భాగంగా బంధువులు, శ్రేయోభిలాషులు నడుమ తెల్లవారుజామున 4 గంటలకు ఆభరణాలు సమర్పించే ఆచారం సాగుతోంది. ఆ సమయంలో వధువు కుటుంబం పెంపుడు కుక్క దూకుడుగా మొరగడం ప్రారంభించింది. విసుగుతో వరుడు కుటుంబానికి చెందిన యువకుడు ఆ కుక్కను కొట్టడంతో మొదలైన గొడవ..చూస్తుండగానే క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. ఈ ఉద్రిక్త ఘటనలో మహిళలతో సహా సుమారు ఎనిమిది మంది దాక తీవ్రంగా గాయపడ్డారు. 

వధువు తరుఫు కుటుంబంలో ముగ్గురి తలలకు తీవ్ర గాయలయ్యినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పోలీస్టేషన్‌కు చేరుకున్నాయి. అక్కడ వివాహాం అధికారికంగా రద్దు చేశారు. ట్విస్ట్‌ ఏంటంటే వధువు తాన్య దీన్ని నిరాకరించింది. తమ పెళ్లి ఎప్పుడో జనవరిలో అయిపోయిందని, ఇది అధికారికంగా నిర్వహించిన తంతు అని స్పష్టం చేసింది. ఆమె తన అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడ తన భర్తతో కలసి ఉన్న వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మరి వివరణ ఇవ్వడం విశేషం.

(చదవండి: కూతురు గ్రాడ్యుయేషన్‌ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!)

 

#

Tags : 1

Videos

మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..

Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!

యుద్ధం తధ్యం.. ఇరాన్‌లోని ఇండియన్స్ కు పిలుపు

నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్

ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్

4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..

విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!

హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?

ఎండాకాలం వాన.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Photos

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విజయవాడలో నోరూరించే రంజాన్ రుచులు.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

జ్యోతిరాయ్ 'కిల్లర్' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)