మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
లైఫే టర్నయ్యిందిలే బుల్బుల్ పిట్ట!
Published on Mon, 02/23/2026 - 12:38
టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ వస్తుంది. మరికొందరికి ఏళ్లు గడిచాక గుర్తింపు దక్కుతుంది. హీరోయిన్ తృప్తి డిమ్రి రెండో కోవకు చెందుతుంది. నేడు (ఫిబ్రవరి 23న) ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
అనుకోకుండా సినిమాల్లోకి..
హీరోయిన్ తృప్తి డిమ్రి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్ డిమ్రి ఎయిరిండియా ఉద్యోగి. తల్లి గృహణి. తృప్తి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆమె సోదరుడి స్నేహితుడు ఫోటోగ్రాఫర్. ఒకరోజు ఈమె ఫోటోలు తీసి ఢిల్లీలోని ఇమేజెస్ బజార్‌కు పంపించాడు. ఆ ఫోటోలు వారికి నచ్చడంతో ఫోటోషూట్‌కు పిలిపించారు. అలా తృప్తి జర్నీ మొదలైంది.
తండ్రి కోరిక నెరవేర్చేందుకు
మొదట్లో యూట్యూబ్ ఛానల్లో పని చేసింది. అక్కడే కెమెరాకు అలవాటు పడటం నేర్చుకుంది. నిజానికి తృప్తి తండ్రికి యాక్టర్ అవ్వాలని కోరికట.. దీంతో తండ్రి కోరికను తాను నెరవేర్చాలనుకుంది. బుల్లితెరపై అయినా నటిస్తే చాలనుకుని మొదట్లో మోడలింగ్ చేసింది. అక్కడ మంచి పేరు రావడంతో నటి అవ్వాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టింది. అయితే నటిని అవుతా అని ఇంట్లో చెప్పగానే కుటుంబంసభ్యులు కొంచెం కంగారుపడ్డారట.

అవకాశాలు లేనప్పుడు..
పైగా బంధువులు కూడా.. ఆమె ఇండస్ట్రీకి వెళ్తే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు అని భయపెట్టారు. అయినా ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవకాశాలు రాని సమయంలో బాధపడింది. కానీ, వెనకడుగు మాత్రం వేయలేదు. అలా మామ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది వచ్చిన లైలా మజ్నులోని లైలా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైంది.
యూత్ క్రష్
2020లో వచ్చిన హారర్ మూవీ బుల్బుల్తో ఓటీటీ స్టార్‌గా మారింది. ఆ మూవీ తర్వాత తన దశ తిరిగిపోయింది. 2023లో వచ్చిన సందీప్‌రెడ్డి వంగా యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అందరికీ క్రష్‌గా మారిపోయింది. బ్లాక్‌బస్టర్ మూవీ భూల్ భులయ్యా 3లో ద్విపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం హిందీలో మా బెహెన్, తెలుగులో ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమా చేస్తోంది. తెలుగులో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం!
చదవండి: ఫుడ్డుతో చంపేస్తున్న ప్రభాస్.. ఏ హీరోయిన్‌కు పంపాడంటే?
Tags : 1