Breaking News

హీరోయిన్‌ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటేనే సిగ్గు: జాకీ ష్రాఫ్‌

Published on Sun, 02/22/2026 - 14:34

బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్‌, జాకీ ష్రాఫ్‌ తాజాగా 'ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో' నాలుగో సీజన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా మాధురి దీక్షిత్‌ మాట్లాడుతూ.. 'కర్మ' సినిమా సెట్‌లో తొలిసారి జాకీ ష్రాఫ్‌ను కలిశాను. నేను ఆ మూవీలో ఒక చిన్న పాటలో నటించాను. 

మొహమాటం
ఆ సమంలో జగ్గూ దాదా (జాకీ ష్రాఫ్‌), అనిల్‌ కపూర్‌ గారు అక్కడే ఉన్నారు. ఇద్దరూ నా పర్ఫామెన్స్‌ చూస్తున్నారు. నాకసలే అదంతా కొత్త.. వీళ్లిద్దరూ నన్నే చూస్తుండటంతో కాస్త మొహమాటంగా ఫీలయ్యాను. ఇక ఆ సాంగ్‌ చూసిన తర్వాత జగ్గూ దాదా, శ్రీదేవి.. అందులో వారిని ఊహించుకున్నారు అని గుర్తు చేసుకుంది.

మాధురి అందాన్ని చూసి..
జాకీ ష్రాఫ్‌ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్‌, నటి సరోజ్‌ ఖాన్‌ ద్వారా నాకు తొలిసారి మాధురి గురించి తెలిసింది. మాధురి అందమైన హీరోయిన్‌ అలాగే అద్భుతమైన డ్యాన్సర్‌ కూడా అని సుభాష్‌ గయ్‌తో చెప్పింది. మాధురిని సినిమాలో ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చింది. అలా తన గురించి తెలిసింది. ఇప్పటికీ నేను మాధురి అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటా.. తను నాతో అన్నిరకాల పాత్రల్లో నటించింది. ‍ప్రియురాలిగా, భార్యగా, అలాగే నా అత్తగానూ యాక్ట్‌ చేసింది. అయితే మాధురితో రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు నేను చాలా మొహమాటపడ్డాను. 

జాకీపై ప్రశంసలు
కొన్ని భావోద్వేగాలు మనసులోనే కదలాడతాయి. వాటిని పైకి చూపించడం కష్టం. పైగా ఆమె మాట్లాడేటప్పుడు తన కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడటడం, పాడటం మరింత కష్టతరం. తను మాత్రం పాత్రలో లీనమైపోయి బోలెడంత ప్రేమను కురిపిస్తుంది అన్నాడు. ఇంతలో మాధురి మాట్లాడుతూ.. జగ్గూ చాలా అమాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అని జాకీ ష్రాఫ్‌పై ప్రశంసలు కురిపించింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్‌లో చివరగా దేవదాస్‌ అనే సినిమా వచ్చింది.

చదవండి: పవిత్ర లోకేశ్‌ నాతో ఎలా ఉంటుందంటే?: నరేశ్‌ పెద్ద కుమారుడు

Videos

కల్తీపాలు తాగి పలువురు చిన్నారులకు అనారోగ్యం

పైన కుర్చీలు.. లోన మద్యం

సుబ్రమణ్యస్వామి పిటిషన్.. నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు ధర్మాసనం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్

అతనితో పనైపోయింది.. అందుకే వాసుదేవరెడ్డి అరెస్ట్

కొంపముంచిన గంభీర్

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు

బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు

నారా లోకేష్ పక్కన ప్రమాదకర వ్యక్తులు

నాటి రాజుల విందులో ఫారిన్ ఫుడ్.. 130 ఏళ్ల నాటి మెనూ వైరల్!

Photos

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

విశ్వక్ సేన్ కల్ట్‌ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)

+5

హిందూ, క్రిస్టియన్‍ పద్ధతుల్లో బ్రిటీషర్‌ని పెళ్లాడిన నటి (ఫొటోలు)