Breaking News

కుర్రాడైనా ఓకే.. రొమాన్స్‌కి రెడీ అంటున్న నడివయసు హీరోయిన్లు

Published on Sun, 02/22/2026 - 12:42

పెద్ద వయసు హీరోలు, పిన్న వయసు హీరోయిన్లు అనేది మన దేశ సినీ తెరపై కనిపించడం అత్యంత సర్వసాధారణ విషయం. అయితే తనకన్నా చిన్న వయసు హీరోతో పెద్ద వయసు హీరోయిన్‌ నటించడం, రొమాంటిక్‌ సీన్లను పండించడం అనేది చాలా అరుదు. హాలీవుడ్‌ చిత్రాల్లో బాగా పాప్యులరైన ఈ తరహా స్క్రీన్‌ రొమాన్స్‌ ఇటీవలి కాలంలో మన సినిమాల్లోనూ తరచు కనిపిస్తోంది. కనిపించినప్పుడల్లా కొంత చర్చనీయాంశంగా, వార్తాంశంగా మారుతున్నప్పటికీ నడివయసు హీరోయిన్స్‌ పట్టించుకోవడం లేదు.

తమకన్నా 10 నుంచి– 25 ఏళ్ల వరకు తక్కువ ఉన్న వయసున్న హీరోలతో తెరపై జత కడుతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ భార్య, మాజీ మిస్‌ వరల్డ్‌  ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ తన కన్నా 9ఏళ్లు చిన్నవాడైన రణ్‌బీర్‌ కపూర్‌ తో ఏ దిల్‌ హై ముష్కిల్‌ అంటూ రొమాన్స్‌ చేసింది. అయితే ఈ సినిమా కవి హదయాన్ని ప్రేక్షకులు అర్ధం చేసుకున్నారు కానీ బచ్చన్‌ కుటుంబం మాత్రం దీన్ని జీర్ణించుకోవడం బహుత్‌ ముష్కిల్‌ అంటూ ఆక్షేపించిందని వార్తలు వచ్చాయి.

సైఫ్‌ అలీఖాన్‌ శ్రీమతి కపూర్‌ వంశ వారసురాలు  కరీనా కపూర్‌ కి అండ్‌ కా అనే సినిమాలో అర్జున్‌ కపూర్‌తో పండించిన డేరింగ్‌ రొమాన్స్‌ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది.  అర్జున్‌ కపూర్‌ ఆమె కన్నా 20ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం.  అలాగే బ్రదర్స్‌ సినిమాలోనూ  తనకన్నా  10ఏళ్ల చిన్నవాడైన సిద్ధార్థ్‌ మల్హోత్రాతో జోడీ కట్టడం ద్వారా కరీనా అలాంటి సాహసాలకు తాను వెనుకాడేది లేదని తేల్చి చెప్పింది.

టాలీవుడ్‌ ప్రిన్స్‌తో కలిసి వారణాసి ద్వారా టాలీవుడ్‌కి వస్తున్న ప్రియాంక చోప్రా  తన కన్నా నాలుగేళ్లు చిన్నవాళ్లయిన హీరో రణవీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్‌ ఇద్దరితోనూ వేర్వేరు సినిమాల్లో సందడి చేసింది. ఇలా 5ఏళ్ల లోపు చిన్నవాళ్లతో నటించిన వారిలో రాణిముఖర్జీ(షాహిద్‌ కపూర్‌తో) శృతిహాసన్‌(గిరీష్‌ కుమార్‌తో) కొంకణా సేన్‌ శర్మ(రణబీర్‌ కపూర్‌తో)...ఇలా జాబితా ఎక్కువగానే ఉంది.

వీళ్లందరూ ఒకెత్తయితే ఫిఫ్టీ ప్లస్‌ లో కూడా సింగిల్‌గా ఉంటూ ప్రేక్షకులను తరగని గ్లామర్‌తో కట్టిపడేస్తున్న టబు తన కన్నా వయసులో ఏకంగా పాతికేళ్లు చిన్నవాడైన ఇషాన్‌ ఖట్టర్‌తో  రొమాన్స్‌ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమెకు అతడు ‘ సూటబుల్‌ బాయ్‌’ అనే దర్శక నిర్మాతల అభిప్రాయం ఎలా ఉన్నా ఈ సినిమా విమర్శకుల నోళ్లకు బాగానే  పనిచెప్పింది.

వృద్ధ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లను చూపడానికి,  చూడడానికి అలవాటు పడింది దక్షిణాది చిత్ర పరిశ్రమ. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ వయస్కుడైన హీరో తో హీరోయిన్లు నటించడం వరకూ కొంచెం మార్పు కనిపిస్తోంది. ఇక తమకన్నా వయసులో బాగా చిన్నవారి పక్కన నటించడం అనేది మన సౌత్‌లో ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.

పెళ్లికైనా, ప్రేమకైనా  మగవాళ్ల వయసు మహిళల కన్నా ఎక్కువ ఉండాలనే సంప్రదాయం నుంచే సినిమా పాత్రలు కూడా పురుడు పోసుకున్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న సామాజిక పరిస్థితులతో పాటు సినిమా పాత్రల తీరుతెన్నులు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మరోవైపు నడివయసులోనూ యువతులకు థీటుగా గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్లు పెరగడం కూడా దీనికి దోహదం చేస్తోంది.

Videos

కల్తీపాలు తాగి పలువురు చిన్నారులకు అనారోగ్యం

పైన కుర్చీలు.. లోన మద్యం

సుబ్రమణ్యస్వామి పిటిషన్.. నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు ధర్మాసనం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్

అతనితో పనైపోయింది.. అందుకే వాసుదేవరెడ్డి అరెస్ట్

కొంపముంచిన గంభీర్

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు

బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు

నారా లోకేష్ పక్కన ప్రమాదకర వ్యక్తులు

నాటి రాజుల విందులో ఫారిన్ ఫుడ్.. 130 ఏళ్ల నాటి మెనూ వైరల్!

Photos

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

విశ్వక్ సేన్ కల్ట్‌ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)

+5

హిందూ, క్రిస్టియన్‍ పద్ధతుల్లో బ్రిటీషర్‌ని పెళ్లాడిన నటి (ఫొటోలు)