గెట్‌... సెట్‌... గో గెటప్‌ ఛేంజ్‌

Published on Sun, 02/22/2026 - 05:57

వెరైటీ క్యారెక్టర్స్‌ వచ్చినప్పుడు నటీనటులు పర్ఫార్మెన్స్‌ పరంగానే కాదు... లుక్స్‌ పరంగా కూడా వెరైటీ చూపించడానికి రెడీ అయిపోతారు. ఒక్కోసారి గుర్తు పట్టడానికి వీలు లేనంతగా క్యారెక్టర్‌కి తగ్గట్టు మారిపోతారు. డార్క్‌ మేకప్,ప్రోస్థెటిక్‌ మేకప్‌... ఇలా మేకప్‌తో డిఫరెన్స్‌ చూపించడంతో పాటు ఫిజికల్‌గా కూడా క్యారెక్టర్‌కి తగ్గట్టు సన్నబడతారు... లావైపోతారు. హీరోలైతే క్లీన్‌ షేవ్‌ లుక్‌లోకి మారిపోతారు... క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే గెడ్డం పెంచుకుంటారు... జుట్టు కూడా పెంచుకుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజ, నాని, అఖిల్,  సాయి దుర్గాతేజ్, విరాట్‌ కర్ణ, సంపూర్ణేష్‌ బాబు... ఇలా స్టార్‌ హీరోస్‌తో పాటు యంగ్‌ హీరోస్‌ తమ సినిమాల కోసం గెటప్‌ ఛేంజ్‌ చేశారు. గెట్‌... సెట్‌... గో అంటూ ఇలా గెటప్‌ ఛేంజ్‌ చేసిన ఆ హీరోలు, వారు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్‌ వేద్దాం.

తొలిసారి ఫుల్‌ మాస్‌ లుక్‌లో...  
‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్‌ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్రపా హీరోయిన్‌గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు తొలిసారి ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు. గతంలో ఎన్నడూ కనిపించనంతగా పోడవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారాయన.

ఇప్పటికే విడుదలైన మహేశ్‌ గెటప్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ అడ్వెంచరస్‌ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు  చూస్తున్నారు. ‘వారణాసి’ని గ్లోబల్‌ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందట. ‘వారణాసి’పై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7 విడుదల కానుంది.  

సరికొత్తగా...  
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్‌’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌). ‘కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, సలార్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్‌ నీల్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్  ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. తన పాత్రకు తగ్గట్టు సన్నగా మారిపోయారాయన. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ మూవీలో ఎన్టీఆర్‌ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్‌. పీరియాడికల్‌ యాక్షన్  డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం మూడువేల మంది జూనియర్‌ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తీసిన పాట హైలెట్‌గా మారనున్నాయి. జూన్‌ 25న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  

ఇరుముడి కోసం 
వరుస సినిమాలు చేస్తూ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతుంటారు రవితేజ. క్లాస్, మాస్‌... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఆయా లుక్‌లోకి మారిపోతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్‌లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్‌ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. సాయికుమార్, అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఆధ్యాత్మికప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్‌ లుక్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పాత్ర కోసం రవితేజ మేకోవర్‌ అయ్యారు. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఇరుముడి’.

రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా విడుదల చేసిన టైటిల్, రవితేజ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక లుక్‌లో రవితేజ చక్కగా ఒదిగిపోయారనే ప్రశంసలు లభించాయి. దర్శకుడు శివ నిర్వాణ పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది. రవితేజ మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మేకోవర్‌ అయ్యారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్‌ టెక్నికల్‌ టీం పని చేస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఇరుముడి’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.  

మరోసారి మ మ మాస్‌ 
రామ్‌చరణ్‌ ఫుల్‌ మాస్‌ లుక్‌లో నటించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయిక. ఈ సినిమాలో పోడవాటి జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా పక్కా మాస్‌ లుక్‌లో కనిపించిన రామ్‌చరణ్‌ ఆ తర్వాత లుక్స్‌ మార్చారు. తాజాగా ఆయన నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్‌ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.

విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు రామ్‌చరణ్‌. ఈ మూవీ కోసం మరింత మాస్‌ లుక్‌లోకి మారారాయన. ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, సాంగ్‌ చూస్తే ఆయన ఎంత మాస్‌గా కనిపించనున్నారో అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం పోడవైన జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా రెండోసారి మ మ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు.

ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి, సినిమాపై మరింత బజ్‌ని పెంచింది. ఈ మూవీని రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌ 30కి వాయిదా వేశారు. 

ప్యారడైస్‌ కోసం...  
హీరో నాని మరోసారి ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘దసరా’, ‘హిట్‌ : ది థర్డ్‌కేస్‌’ వంటి సినిమాల్లో ఫుల్‌ మాస్‌గా కనిపించిన ఆయన తాజాగా ‘ది ప్యారడైజ్‌’ మూవీ కోసం పవర్‌ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మేకోవర్‌ అయ్యారు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్‌ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్‌ ఓదెల,  సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. 

ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్‌ జుయల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్‌ అనే రా రస్టిక్‌ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని పక్కా మాస్‌ లుక్‌లో కనిపించగా ఏ స్థాయిలో స్పందన వచ్చిందో  ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాని లుక్, స్టోరీ, టేకింగ్‌... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్‌ ఓదెల.       ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి పోస్ట్‌పోన్‌ అయ్యి ఆగస్టు 21న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.  

లెనిన్‌ కోసం...  
అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్‌ మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్‌. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు.

రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ యాక్షన్  డ్రామాగా ‘లెనిన్‌’ రూపొందుతోంది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెబుతున్నారు అఖిల్‌. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్‌ చెప్పిన  డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీని వేసవి కానుకగా మే 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.  

సంబరాల కోసం...  
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్‌పై ‘హను–మాన్‌’ (2024) వంటి పాన్‌ ఇండియన్‌ హిట్‌ అందుకున్న కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేకించి తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్‌ కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్‌ అయ్యారు. అద్భుతమైన యాక్షన్   సన్నివేశాలతో ఇప్పటివరకూ చూడని పాత్రలో సాయిదుర్గా తేజ్‌ ప్రేక్షకులను అలరిస్తారని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదాపడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ని మాత్రం మేకర్స్‌ ప్రకటించలేదు.  

నాగబంధంలో...  
‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తున్న ద్వితీయ సినిమా ‘నాగబంధం’. ‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అన్నది ట్యాగ్‌లైన్ . నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత అభిషేక్‌ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్‌ అవినాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు విరాట్‌ కర్ణ. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్, గ్లింప్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

‘‘అభిషేక్‌ నామా అత్యంత భారీగా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. మహాశివరాత్రి సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ మిస్టికల్‌ ఎపిక్‌ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్ కు పైగా వ్యూస్‌ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మూవీ కోసం విరాట్‌ కర్ణ అద్భుతంగా ట్రాన్ ్సఫార్మ్‌ అయ్యారు. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా శివుని అవతారంలో కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది. మా సినిమాని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

సరికొత్త బిర్యానీ...  
‘ది ప్యారడైస్‌’ సినిమాలో నటుడు సంపూర్ణేష్‌ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జడల్‌ పాత్ర పోషిస్తున్న నాని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్‌ కనిపించనున్నారు. బిర్యానీ పాత్ర లుక్‌ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో సంపూర్ణేష్‌ గెటప్‌ ఆశ్చర్యపరచేలా ఉంది. పోడవాటి హెయిర్, గెడ్డం, రఫ్‌ లుక్, ఇంటెన్ ్స ఎక్స్‌ప్రెషన్ తో ఈ పాత్ర కోసం సరికొత్తగా మేకోవర్‌ అయ్యారాయన. ఈ మూవీ నుంచి విడుదలైన సంపూర్ణేష్‌ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే ఆయన పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.  

పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కూడా తమ పాత్రల కోసం సరికొత్తగా గెటప్‌ ఛేంజ్‌ చేస్తున్నారు.
– డేరంగుల జగన్‌ మోహన్‌

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)