అతనంటే విపరీతమైన క్రష్!

Published on Sun, 02/22/2026 - 03:33

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమాయకపు ఆకాంక్షగా, ‘సరైనోడు’లో పవర్‌ఫుల్‌ ఎమ్మెల్యేగా మనల్ని మెప్పించిన ఈ మలయాళ కుట్టి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌ రహస్యాలను ఇప్పుడు మనతో పంచుకుంటోంది క్యాథరిన్‌ ట్రెసా. ఆ విశేషాలు...

చిన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్  అంటే విపరీతమైన క్రష్‌. ఆయన టీవీలో కనిపిస్తేనే అన్నం తినేదాన్నని అమ్మ ఇప్పటికీ ఆటపట్టిస్తుంది. అలా ఎందుకు చేసేదాన్నో ఇప్పటికీ నాకు మిస్టరీనే.
నేను మలయాళీ క్రిస్టియన్ . పుట్టి పెరిగింది దుబాయ్‌లో. కాలేజీ రోజుల్లో బెంగళూరుకు షిఫ్ట్‌ అయ్యాను. అక్కడే నా మోడలింగ్‌ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కన్నడ సినిమా ‘శంకర్‌ ఐపీఎస్‌’ అవకాశం నా కెరీర్‌కు కొత్త మలుపును ఇచ్చింది.

సినిమాల్లోకి రాకముందు నేను ప్రొఫెషనల్‌ స్థాయిలో ఐస్‌ స్కేటింగ్‌ చేసేదాన్ని. మంచు మీద వేగంగా బ్యాలెన్ ్స చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వెకేషన్ కు వెళ్తే స్కేటింగ్‌ షూస్‌ నా బకెట్‌లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి.
సంగీతం నాకు మెడిటేషన్  లాంటిది. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పియానో వాయిస్తాను. నేను క్వాలిఫైడ్‌ పియానిస్ట్‌ని.

తెలుగులో ‘చమ్మక్‌ చల్లో’తో ఎంట్రీ ఇచ్చాను. కాని, నిజమైన బ్రేక్‌ ఇచ్చింది ‘ఇద్దరమ్మాయిలతో’. ‘సరైనోడు’లో ఎమ్మెల్యే పాత్ర నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌.

కేరళలో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో నేను ఏనుగుపై నుంచి కింద పడిపోయాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుంచి ఏనుగులంటే ప్రేమ ఉన్నా, వాటి దగ్గరికి వెళ్లాలంటే భయం.
ఒక గంట ఖాళీ దొరికినా బిజినెస్‌ మ్యాగజైన్స్‌ చదువుతాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ వుమన్ గా మారేదాన్ని. నా ఆర్థిక నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను.

పాత ఫొటోలను ఆల్బమ్స్‌గా చేసి దాచుకోవడం నా అలవాటు. డిజిటల్‌ యుగంలో ఉన్నా, ప్రింట్‌ ఫొటోలే నా సెంటిమెంట్‌.

నా జీవితంలో అతిపెద్ద బాధ నా తమ్ముడు క్రిస్టోఫర్‌ మరణం. ఎనిమిదేళ్ల క్రితం తను సూసైడ్‌ చేసుకున్నాడు. ఆ లోటు తీరనిది.
స్వీట్స్‌ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా తాపేశ్వరం మడతకాజా, మైసూర్‌ పాక్‌. అలాగే ‘లిక్విడ్‌ డైట్‌’ మీద నాకు మంచి కంట్రోల్‌ ఉంది. బాడీని డీటాక్స్‌ చేయడానికి వారంలో ఒకరోజు కేవలం కొబ్బరి నీళ్లు, గ్రీన్  జ్యూస్‌లతోనే ఉంటాను. అదే నా గ్లామర్‌ రహస్యం.

నా డ్రీమ్‌ మ్యాన్  పొడవుగా, ఫిట్‌గా ఉండాలి. ముఖ్యంగా మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి.
గ్లామర్‌ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటాను. అందుకే అప్పుడప్పుడు గ్యాప్‌ వస్తుంది. నా కెరీర్‌లో ఇంకా మంచి కామెడీ సినిమాలు చేయాలని ఉంది. 

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)