Breaking News

మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!

Published on Tue, 02/17/2026 - 11:09

భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ ఇలీవల బెంగళూరు పర్యటనకు వచ్చారు. ఈ నగరాన్ని చూసి..దాని ఉత్సాహభరితమైన చైతన్యానికి అబ్బురపడుతూ..సాటిలేని శక్తిగా అభివర్ణించారు. ఆ తర్వాత బెంగళూరు దక్షిణ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్యతో కలిసి స్థానిక వంటకాలను ఆస్వాదించారు. 

అందుకు సంబంధించిన ఫోటోలను గోర్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఇక సూర్య కూడా తన ఎక్స్‌ ఖాతాలో ఆ మధుర క్షణాలను పంచుకుంటూ..భారతదేశంలో బెంగళూరు నగరానికి అమెరికా రాయబారి హెచ్‌. ఇ సెర్గియో గోర్‌ని ఆ‍హ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఇందిరానగర్‌లోని హోటల్‌లో కొన్ని మసాలా దోసెలు, చక్కటి స్ట్రాంగ్‌ కాఫీ సేవిస్తూ.. తాత్కాలికి వాణిజ్య ఒప్పందంపై సంభాషించినట్లు తెలిపారు.

 

ఆ సమావేశంలో భారత అమెరికా భాగస్వామ్యం, వాణిజ్యం, సాంకేతికత ఆవిష్కరణలపై చర్చించినట్లు కూడా ఎతిపారు. అలాగే గోర్‌కు నమ్మ ఆటో రైడ్‌ని పరిచయం చేసినట్లు పేర్కొన్నారు పోస్ట్‌లో. అలాగే ప్రత్యేక పోస్ట్‌లో సూర్య భారత అమెరికా సంబంధాలలో బెంగళూరు నగరం కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఈ నగరం మసాలా దోసం నుంచి వివిధ యంత్ర సామర్థ్యాలు పలు ఆవిష్కరణలను మిళితం చేయడమేగాక, రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రజల మధ్య ఆర్థిక సంబంధాలను బోలపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 

ఎందుకంటే..700కు పైగా  అమెరికన్ కంపెనీల్లో భారతదేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో 43% బెంగళూరు నుంచి వస్తున్నందున, మన నగరం US-భారత ఆర్థిక సంబంధాలకు కేంద్రంగా ఉంది. భారతదేశంలోని GCC(గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లలో 40%కి నిలయంగా ఉన్న బెంగళూరు, మన రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆవిష్కరణ ఆధారిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది, ”అని సూర్యా రాసుకొచ్చారు పోస్ట్‌లో. 

కాగా, రాయబారి గోర్‌ వైట్‌హౌస్‌ అధ్యక్షుడిగా ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తన వృత్తిపరమైన కెరీర్‌ జర్నీలో రిపబ్లికన్‌ నేషనల్‌  కమిటీ, అమెరికన్స్‌ ఫర్‌ లిమిటెడ్‌ గవర్నమెంట్‌ అండ్‌ కాపిట్‌ హిల్‌ తదితర విభాగాల్లో పనిచేశారు. ఇక విద్యానేపథ్థ్యం వచ్చేటప్పటికీ..జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన గోర్ 2008లో పొలిటికల్ సైన్స్ అండ్‌ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.

(చదవండి: టెన్త్‌ ఫెయిల్‌..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!)

 

Videos

చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి

బావతో పెళ్లి ఇష్టంలేక ... కుంభమేళా మోనాలిసా ప్రేమకథ..

భారత్ కు వస్తున్న నౌకను పేల్చేసిన ఇరాన్..!

ఇరాన్ ఓపెన్ వార్నింగ్ 200 డాలర్లకు చమురు ధర! ఇక ఆర్థిక సంక్షోభమే

రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?

వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి

దేశంలో గ్యాస్ కొరత లేదు... కేంద్రం కీలక ఆదేశాలు

దుబాయ్ పై మరోసారి దాడి..

షా గౌస్ రెస్టారెంట్లో... గ్యాస్ కొరత ఏర్పడడంతో...

Photos

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్‌ రికవరీ (ఫొటోలు)