చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి
Breaking News
'వారణాసి'లో ప్రకాష్ రాజ్ పాత్ర పవర్‌ఫుల్.. రివీల్ చేసిన నటుడు
Published on Tue, 02/17/2026 - 09:00
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్ సినిమా ‘వారణాసి’.. ఇందులో ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనేది దర్శకుడు ప్రకటించలేదు. దీంతో సోషల్‌మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మహేశ్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. వారణాసిలో శివుడి పరమ భక్తుడిగా నటిస్తున్నానని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ పంచుకున్నారు. ఆపై హిందీ ‘దృశ్యం 3’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.
రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే విక్రమార్కుడులో నటించిన విషయం తెలిసిందే. ఆపై మహేశ్‌తో కూడా ఆయన కలిసి పలు సినిమాల్లో నటించారు. ఒక్కడు, రాజకుమారుడు, గుంటూరు కారం వంటి పలు సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు వారణాసిలో వీరిద్దరూ మరోసారి కలిశారు. మైథలాజికల్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వారణాసి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్‌ను అంటార్టికాలోనూ ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
“I am a Maha Shiva Bhakt in #Varanasi”
— #PrakashRaj
pic.twitter.com/Xr3AMjQZH9— cinee worldd (@Cinee_Worldd) February 16, 2026
Tags : 1