Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
Published on Sun, 02/15/2026 - 19:04
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్‌ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.
లైఫ్‌లో సెటిలవాలి
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్‌లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.
సన్యాసి జీవితమే..
యాక్టర్‌గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్‌డ్‌గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.
అందులో డౌటే లేదు
రూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్‌ను పట్టించుకుంటూ పోతే కెరీర్‌పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్‌మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది?
Tags : 1