బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
వాలెంటైన్స్ డే స్పెషల్.. పవిత్రా లోకేశ్‌కు నరేశ్ స్వీట్ విషెస్..!
Published on Sun, 02/15/2026 - 08:41
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా సుహాస్ హీరోగా వస్తోన్న హే భగవాన్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. శివానీ నాగారం హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే నరేశ్ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పవిత్రా లోకేశ్‌తో సరదా ఇంటర్వ్యూ జరిగింది. హే భగవాన్ మూవీ గురించి పవిత్రా లోకేశ్ ప్రశ్నలు అడగ్గా.. నరేశ్ సమాధానాలిచ్చారు. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేను మరిచిపోలేని పది సినిమాల్లో పాత్రల్లో ఇది ఒకటని అన్నారు. నాతో ఇంటర్వ్యూ ఎలా ఫీలవుతున్నారని పవిత్రా అడగ్గా.. నువ్వు చాలా బాగా మాట్లాడావ్.. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి యాంకర్ అవుతావని నేను నమ్ముతున్నా అంటూ పంచులు వేశారు.
అంతేకాకుండా వాలెంటైన్స్ డే కావడంతో పవిత్రకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.. ప్రియతమ నువ్వు అచట కుశలమా.. నేను ఇచట కుశలమే అంటూ లవ్ సాంగ్ పాడుతూ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేమికుల రోజున మూవీ ప్రమోషన్‌తో పాటు వీరిద్దరి ప్రేమబంధం చూసిన ఆడియన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
పవిత్రకే బిజినెస్ ఏంటో చెప్పలేదు...
మీరు చెబితే 20K,#Guess Cheyyandi#HeyBhagawan pic.twitter.com/hwOA60mRVh— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026
Tags : 1