వారణాసి జానర్‌పై కన్‌ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!

Published on Fri, 02/13/2026 - 16:59

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్‌ అవైటేడ్  అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్‌ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్‌లో మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్‌ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.

కొందరు ఈ సినిమాను ఫిక్షన్‌ అని అంటున్నారు. మరికొందరేమో విలన్‌ పాత్రధారి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్‌లుక్‌ చూసి సైన్స్ ఫిక్షన్‌ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్‌పై ఆడియన్స్‌లో విపరీతమైన కన్‌ఫ్యూజన్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్‌పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్‌ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్‌లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇ‍చ్చారు. దీంతో ఆడియన్స్‌ అనుమానాలకు చెక్ పడినట్లైంది. 

కాగా.. వారణాసిలో మహేశ్‌బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ రోల్‌ కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్

మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు

జోరుమీదున్న వెంకీ మామ ఏకంగా లైన్ లో 7 సినిమాలు

Arjun Sarja: రోజుకో గంట మీ శ‌రీరానికి ఇచ్చుకోండి లైఫ్‌లో ఫిట్‌గా ఉంటారు

కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి.. కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

మున్సిపల్ రిజల్ట్పై BRS క్రిశాంక్ కామెంట్స్

ఇండియన్ ఆర్మీ లోకి వేట పక్షులు

దోచుకోవడమే వీళ్లకి తెలుసు స్టాలిన్ పై విజయ్ ఫైర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్.. కార్యకర్తల సంబరాలు

రేణిగుంట నారాయణ కాలేజీలో దాష్టీకం విద్యార్థిని చితకబాదిన లెక్చరర్

Photos

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )

+5

విశ్వక్‌ సేన్‌ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కశ్మీర్‌ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష‍్మీరాయ్ (ఫోటోలు)

+5

శ్రీశైలం: నల్లమల అడవుల్లో భక్తుల పాదయాత్ర (ఫోటోలు)

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)