Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి
Breaking News
ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..
Published on Thu, 02/12/2026 - 15:56
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూసలమ్మే అమ్మాయి గుర్తుందా..!. అందమైన మోముతో అందర్నీ ఆకర్షించి..రాత్రికిరాత్రికే సంచలనంగా మారింది. పైగా నటిగా అవకాశం వరించింది కూడా. అలా ఏదోక విశిష్ట లక్షణంతో సెన్సెషన్ అయిన వాళ్లెందర్నో చూశాం. కానీ ఇలాంటి కళ్లున్న అమ్మాయిని మాత్రం చూసుండరు. ఈ అమ్మాయి 20 ఏళ్ల క్రితం పలు పోస్ట్‌కార్డ్‌లపై కనిపించి సంచలనంగా మారింది. అయితే అప్పుడు సోషల్ మీడియాలు లేవు కాబట్టి..మ్యాగ్జైన్ కవర్‌పేజీలో, పర్యావరణ సావనీర్‌లలోనూ ఆమె ముఖ చిత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏముంది ఆమె ముఖంలో అంతగా ఆకర్షించేది అంటే..ఆమె అందమైన కళ్లు. కవులు చెప్పే కలువరేకుల్లాంటి కనులు గురించి విని ఉంటారు. కానీ ఈమె కళ్లు ఎలా ఉంటాయో తెలిస్తే..విస్తుపోతారు. ఇంతకీ ఎవరీమె అంటే..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాజస్థాన్‌లోని పుష్కర్ ఫెయిర్‌లో ఆ యువతి ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎడారి పట్టణ నేపథ్యం నుంచి వచ్చి ఆమె చిత్రాలు చాలా దూరం ప్రయాణించాయి. ఆ అమ్మాయే రాజస్థాన్‌కి చెందిన పప్పుదేవి. మళ్లీ ఇన్నేళ్లకు ఆన్‌లైన్‌లో ఆమె ఫోటో వైరల్‌గా మారి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం.
ఇంతకీ ఆమె మోములోని స్పెషల్టీ మొత్తం కళ్లదే. ఆ కళ్లు అలాంటి ఇలాంటివి కాదు..అచ్చం పులి లాంటి అందమైన కళ్లు. వాటిని చూస్తే కళ్లుతిప్పుకోలేం. మరోసారి చూడాలనిపించేంతగా కట్టిపడేస్తాయి. 20 ఏళ్ల క్రితం ఒక విజిటింగ్ ఫోటోగ్రాఫర్ ఆమె అద్భుతమైన పులికళ్లను క్లిక్‌మనిపించడంతో ఆమె ముఖ చిత్రం పలు వార్తపేపర్లలోనూ, పోస్టకార్డులపైకి వెళ్లిపోయింది. అలా ఆమె రాత్రికి రాత్రికే సెలబ్రిటీ అయిపోయింది.
మళ్లీ సరిగ్గా ఇప్పుడుమరోసారి ఆ పప్పుదేవి ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉందని ఆరాలు మొదలయ్యాయి. ఇక పప్పు దేవి ఒక సఫారి డ్రైవర్‌ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆమె ఇద్దరు కుమార్తెలకు వారసత్వంగా పులికళ్లు వచ్చాయి. ఆ అమ్మాయిలు ఇద్దరు పప్పు దేవికి స్టాల్‌లో చేదోడు వాదోడుగా ఉంటారట.
పర్యాటకులను పిలుస్తూ..మిర్రర్ వర్క్ బ్యాగులను విక్రయించడంలో సాయం అందిస్తారట. అయితే సందర్శకులు చాలామంది తనను, ఆ ఇద్దరు కుమార్తెలను చూసి అవిశ్వాసం వ్యక్తం చేస్తూ..ప్లీజ్ కళ్లజోడు పెట్టుకోరా అని అడగుతారని అంటోంది పప్పుదేవి. కాగా, పప్పుదేవి తాను బంజారా కమ్యూనిటీకి చెందినదాన్ని కాదని స్పష్టం చేసింది. ఎవరో ఒక వ్యక్తి తన కళ్లను చూసి అందుకు సరిపోయే దుస్తులు ధరించమని సూచించడంతో ఈ వేషధారణలో ఉన్నానని వివరణ ఇచ్చిందామె.
(చదవండి: ఆ పెంగ్విన్‌ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..)
Tags : 1