Breaking News

‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!

Published on Thu, 02/12/2026 - 12:12

బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్‌లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.

అన్వేషణ, మైనింగ్

బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్‌గ్రౌండ్ మైనింగ్ అంటారు.

ముడి ఖనిజాన్ని పొడి చేయడం

గనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్‌లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.

బంగారం వేరు చేయడం

పొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.

సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్‌కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.

గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.

స్మెల్టింగ్

పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్‌ రూపంలోకి మారుస్తారు.

శుద్ధీకరణ(రిఫైనింగ్‌)

చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్‌ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్‌) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.

ఆభరణాల తయారీ

చివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.

  • ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!

ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్‌ఫుల్‌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ ఇదే..

Videos

మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్

బంగారం కంటే ఖరీదైన చెట్టు... కిలో ..రూ. కోటి

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్

డ్రెస్సింగ్ పై.... హగ్ చేసుకుందాం అనుకున్న కానీ.. చీరలతో వచ్చారు

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)