Breaking News

అప్పుడు లెజండరీ యాక్టర్‌...ఇవాళ లైఫ్‌కోచ్‌గా..!

Published on Wed, 02/11/2026 - 17:41

అప్పట్లో భారతీయ టెలివిజన్‌ రంగంలో తన అందం, గొంతుతో సంచలనం సృష్టించిన రూబీ భాటియా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే, ఈసారి ఆమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె గ్లామర్‌ కాదు.. రూ. 1,000 కే అందిస్తున్న లైఫ్‌ కోచింగ్‌ సర్వీసెస్‌. ఈ ప్రకటనలు చూసిన నెటిజన్లు, ముఖ్యంగా 90ల కాలం నాటి అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్‌ తీసుకున్న ఒక లెజెండరీ యాంకర్‌.. 

90వ దశకంలో భారతీయ టెలివిజన్‌ రంగంలో ఛానల్‌వి హవా నడిచిన కాలం. ఆ తరం యువతకు ఫ్యాషన్‌ ఐకాన్‌ రూబీ భాటియా. తన విలక్షణమైన ఇంగ్లీష్‌ యాక్సెంట్, చిరునవ్వు, మెరిసే కళ్ళతో ఆమె బుల్లితెరను శాసించేది. మాజీ మిస్‌ ఇండియా కెనడా అయిన రూబీ భారత్‌ మొట్టమొదటి వీడియో జాకీగానూ గుర్తింపు పొందారు. 

మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె ఒక స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ముందు కనిపిస్తూ నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బరువు తగ్గడం, ఆందోళన, డిప్రెషన్‌ వంటి విషయాలపై లైఫ్‌ కోచింగ్‌ ఇస్తానంటూ ఆమె ఇటీవల వీడియోలు విడుదల చేశారు. వీటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. 

ఆమెను ఇలా చూడటం మనుసుకి భారంగా ఉందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఏ పనీ చిన్నది కాదని భావించి, స్వయంగా తన సేవలను ప్రమోట్‌ చేసుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. 

 

(చదవండి: ఆ హోటల్‌ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్‌!)

#

Tags : 1

Videos

మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్

బంగారం కంటే ఖరీదైన చెట్టు... కిలో ..రూ. కోటి

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్

డ్రెస్సింగ్ పై.... హగ్ చేసుకుందాం అనుకున్న కానీ.. చీరలతో వచ్చారు

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)