Breaking News

లేటెస్ట్‌ లంగా ఓణి..! బుట్టబొమ్మల్లా అమ్మాయిలు..

Published on Fri, 02/06/2026 - 17:36

ఫ్యాషన్‌లో ఎన్నో డిజైన్స్‌ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్‌ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్‌ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్‌ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్‌ డిజైనర్‌ భార్గవి కూనమ్‌ హాఫ్‌ శారీస్‌ డిజైన్స్‌లో వస్తున్న గ్రాండ్‌లుక్‌ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. 

‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్‌ శారీ ఫంక్షన్‌. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్‌శారీ ఫంక్షన్‌ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు. 

మన చేనేతలు
బెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్‌ శారీ, ధోతీ డిజైన్స్‌ ఇవి. లైట్‌ కలర్స్‌కి కాంట్రాస్ట్‌ కలర్‌ కాంబినేషన్‌ పట్టు, కోటా ఫ్యాబ్రిక్‌ ఉపయోగించాం. జరీ వర్క్‌తో చేసిన హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్‌ లుక్‌ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్‌ జర్నీ ఇది. 

ఆభరణాల మార్క్‌
హాఫ్‌ శారీస్‌కు ఆభరణాల కాంబినేషన్‌ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్‌ క్రియేట్‌ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్‌ వర్క్‌ ఇది. లంగాఓణీ కాంబినేషన్‌ డ్రెస్‌ మనదైన సంప్రదాయ డ్రెస్‌ కాబట్టి, దీనికి మన సౌత్‌ ఇండియన్‌ టెంపుల్‌ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్‌ చేస్తూ పెద్ద పెద్ద హారాలు,  డైమండ్‌ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్‌. 

(చదవండి: బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..)

Videos

ఇరాన్‌లో నీరు మాయం? దేశమే రోడ్డెక్కింది!

మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..

పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాక్ POK భారత్‌లో అంతర్భాగమే..

ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ

అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త

మల్లా రెడ్డిపై దాడి... 150 మంది వచ్చి దబా దబా కొట్టారు

గజ్వాల్‌లో హై టెన్షన్.. హరీశ్‌రావుకు నిరసన సెగ

సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)