జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..
Published on Fri, 02/06/2026 - 14:04
ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్‌లు వచ్చినా.. భారతీయ వారసత్వానికి మించింది లేదు. సాంప్రదాయ దుస్తుల్లోని అందమే వేరు. బంగారు మోటీఫ్‌లతో ఉండే బనారీసి చీర లుక్కే ఎవర్‌గ్రీన్. ఆ విషయాన్ని రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. తరచుగా బెనరసీ చీరలతో తళుక్కుమనే నీతా ఈసారి సంప్రదాయ ఎరుపు బనారసీ చీరతో పండుగ వాతావరణం తెప్పించారు. యాభైఏళ్ల క్రితం నాటి ఈ ఫ్యాషన్ నేటికి అద్భుతమే అని చాటిచెప్పారు.
ఎరుపు రంగు బంగారు జరీతో ఉన్న ఈ బనారసీ చీర ..చేనేత కళాకారుల నైపుణ్యాన్ని హైలెట్ చేసింది. అందుకు తగ్గట్టుగా ధరించిన మ్యాచింగ్ బ్లౌజ్ వెనుక భాగం రాజదర్పంలా లేదా ఆలయ చిహ్నంలాంటి క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ స్పెషల్ ఎట్రాక్షన్‌ని ఇచ్చింది. ఈ చిహ్నం శ్రేయస్సుకి సంకేతం కూడా.
ఇంతలా వివరణాత్మకంగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఈ దుస్తుల ప్రాధాన్యతను, భారతీయ సంస్కృతిని మరింత హైలెట్ చేసింది. నీతా ఈ కాస్ట్యూమ్‌కి తగ్గట్టుగా కాంట్రాస్ట్‌గా పచ్చని డైమండ్ నెక్లెస్ ధరించి.. తన లుక్‌ని మరి ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. ఆ ఎరుపు పట్టు చీరకు ఆ పచ్చని నెక్లెస్ మరింత అందం. నిండుదనం ఇచ్చింది.
(చదవండి: Strawberry: స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..)
Tags : 1