జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
హిందీ వాళ్లపై కోపం లేదు.. 'పరాశక్తి' తెలుగు ట్రైలర్
Published on Fri, 02/06/2026 - 10:38
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ తమిళ్‌లో మాత్రమే విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా కనీసం ట్రైలర్ కూడా ఆ సమయంలో రిలీజ్ చేయలేదు. అయితే, కోలీవుడ్‌లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డైరెక్ట్‌గా తెలుగు వర్షన్‌ను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను జీ5 వేదికగా పంచుకున్నారు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే మూవీతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
పరాశక్తి(Parasakthi) సినిమా ఫిబ్రవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో పేర్కొన్నారు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఇందులో చూపించారు.
Tags : 1