చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
మళ్లీ యాక్ట్ చేస్తాననుకోలేదు: రియా ఎమోషనల్
Published on Thu, 02/05/2026 - 18:53
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి కెరీర్, జీవితం చిన్నాభిన్నమైంది. సుశాంత్ మృతి, డ్రగ్స్ కేసులో రియా అరెస్టయి జైలు జీవితం కూడా గడిపొచ్చింది. 5 ఏళ్లపాటు ఎన్నో నిందలు మోసింది. చివరకు సుశాంత్ మృతి కేసుకు, రియాకు ఎటువంటి సంబంధం లేదని 2025లో సీబీఐ కేసు క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది.
రీఎంట్రీ
కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన కెరీర్ క్లోజ్ అయినట్లేనని రియా ఎంతో దిగులుచెందింది. అలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి పిలుపొచ్చింది. ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం అందుకుంది. రెండు రోజుల క్రితమే సిరీస్ టీజర్ వదిలారు. తన రీఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రియా. 7 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను.
కెరీర్ ముగిసిందనుకున్నా
అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ అవ్వాలని 17 ఏళ్ల వయసులో బలంగా అనుకున్నాను. నా జర్నీ మొదలుపెట్టాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనకు చరమగీతం పాడక తప్పదనుకున్నాను. ఇంతలోనే మళ్లీ యాక్ట్ చేసే అవకాశం.. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు. అయినా ఇదెంత బాగుందో అని చెప్పుకొచ్చింది.
నా జీవితంలో రెండో చాప్టర్
ఈ వీడియోకు సెట్‌కు వెళ్లి ఏడేళ్లవుతోంది. నటి అవ్వాలన్న కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇది నా జీవితంలో ఇది రెండో చాప్టర్. నా ప్లాన్స్‌లో నేనుంటే జీవితం నన్నిలా సర్‌ప్రైజ్ చేసింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగ్రాచ్యులేషన్స్, నీకు అంతా శుభమే జరగాలి అని కామెంట్లు చేస్తున్నారు.
సినిమా
రియా చక్రవర్తి వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్‌కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, జిలేబి వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. రియా చివరగా 2019లో వచ్చిన చెహ్రె మూవీలో కనిపించింది.
చదవండి: రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఏడ్చేసిన భూమిక
Tags : 1