Breaking News

బిట్‌కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!

Published on Thu, 02/05/2026 - 15:55

బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.

బిట్‌కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్‌కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్‌కాయిన్‌లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

బిట్‌కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్‌కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్‌కాయిన్‌ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్‌లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్‌కాయిన్‌ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.

బిట్‌కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్‌కాయిన్‌పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్‌కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్‌కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.

ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!

#

Tags : 1

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)