Breaking News

6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!

Published on Thu, 02/05/2026 - 12:15

పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్‌ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.

నా కూతురే ఒక అద్భుతం
హీరోయిన్‌ ప్రియాంక చోప్రా- సింగర్‌ నిక్‌ జోనస్‌ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్‌ జోనస్‌. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నిక్‌ జోనస్‌ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. 

కిలో కంటే తక్కువ బరువు
భవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. 

ఫలించిన నిరీక్షణ
మూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్‌స్పిరేషన్‌.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్‌.

చదవండి: చంద్రహాస్‌పై కేసు నమోదు

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)