Breaking News

ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన

Published on Thu, 02/05/2026 - 11:52

కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్‌ కోవర్క్‌’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్‌ఇన్‌లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్‌లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.

ఐటీ రంగానికి సవాలు..

ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్‌ఇన్‌లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.

లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.

కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.

సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.

ఎంటర్‌ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్‌లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.

ఇప్పటివరకు ‘సాస్‌’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను మన కంప్యూటర్ లేదా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్‌ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్‌ వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.

భారత ఐటీ రంగంపై ప్రభావం..

భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్‌సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.

  • గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.

  • ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.

  • భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.

ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)