Breaking News

ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి

Published on Thu, 02/05/2026 - 10:15

టాలీవుడ్‌లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్‌ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.  తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.

ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని  బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్‌ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి.  కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

ఎవరీ వాహిని?
విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్‌ అయింది. చివరగా పోలీస్‌ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.  నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.

కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు.  బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు.

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)