Breaking News

'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?

Published on Wed, 02/04/2026 - 12:42

ఈ మధ్య కాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. గత డిసెంబరులో రిలీజైనప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇందులో నటించిన రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్.. ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్‌గా చేసిన సారా అర్జున్ కూడా ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె.. చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసిందట.

(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)

ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. త్వరలో 'విశ్వంభర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. గతేడాదే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకొస్తున్నాయి.

ఇందులో చిరుకి జోడీ ప్రియమణిని ఎంపిక చేశారని.. మోహన్ లాల్ కీలక పాత్ర కోసం తీసుకున్నారని.. విలన్‌గా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్‌ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది కానీ సారా ఫైనల్ అయినట్లు ఉంది. సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఠాకుర్)

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)