KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్‌కి 6 నెలలు ట్రైనింగ్
Published on Wed, 02/04/2026 - 10:10
మహేశ్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి రన్నింగ్. ఇతడు చేసిన ఏ సినిమా చూసినా మిగతా వాళ్లతో పోలిస్తే మహేశ్ కాస్త డిఫరెంట్‌గా పరుగెత్తుతాడు. అయినా సరే ఇది అభిమానులకు బాగానే నచ్చేసింది. ఎవరైనా మహేశ్ గెటప్ వేయాలన్నా సరే అతడి రన్నింగ్ స్టైల్‌నే ఫాలో అయిపోతుంటారు. అలాంటిది కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత మహేశ్.. ఈ విషయంలో కొత్తగా కనిపించనున్నాడు. లేదు రాజమౌళి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ మార్చేశాడు. దీని గురించి స్వయంగా మహేశ్ బాబే చెప్పాడు.
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. గతేడాది నవంబరులో టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియోతో రివీల్ చేశారు. ప్రస్తుతం, గతం, భవిష్యత్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్.. శ్రీ రాముడి పాత్రలోనూ కాసేపు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసమే తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నానని మహేశ్ చెప్పాడు.
(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ)
రాముడి పాత్ర కోసం ఆహార్యం మెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు ఏడాది ప్రిపరేషన్ చేశాం. 2-3 నెలలు కలరీ యుద్ధవిద్య కూడా నేర్చుకున్నాను. అలానే రాజమౌళి.. నా రన్నింగ్ టెక్నిక్ మార్చాలని అన్నాడు. దీనికోసం ఏకంగా 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాం. కాకపోతే 2 సీన్లు మాత్రమే తీశారు. అలాంటి నిబద్ధత 'వారణాసి' కోసం నేను చూపించాను అని మహేశ్ బాబు.. తాజాగా రిలీజ్ చేసిన 'వారణాసి' ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్నికొన్నిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు పాన్ ఇండియా వరకే తమ మూవీస్ రిలీజ్ చేసిన జక్కన్న.. 'వారణాసి'తో గ్లోబల్ వైడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)
Tags : 1