పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది
Breaking News
పశువైద్యంలో యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం
Published on Tue, 02/03/2026 - 06:30
పశువ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% వరకు తగ్గించే సాంప్రదాయ మూలికా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసిన తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఎత్నో–వెటర్నరీ మెడిసిన్ (ఈవీఎం)లకు శాస్త్రీయ ప్రామాణికతను నిరూపించటంలో, రైతుల చెంతకు చేర్చటంలో డా. పుణ్యమూర్తి విశేష కృషి చేశారు.
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మహమ్మారికి అసలైన పరిష్కారం ఈవీఎం చికిత్సలేనని డా. పుణ్యమూర్తి తెలిపారు. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి తీవ్ర జబ్బులను ఈవీఎం చికిత్సలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రీయ పరీక్షలతో పాటు రైతుల అనుభవంలోనూ రుజువైందన్నారు.
తమిళనాడు తంజావూరు సమీపంలోని వల్లం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పశువైద్యంలో డాక్టరేట్ చేసి, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ డీన్‌గా పనిచేసిన ఆయన 2001లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా బెంగళూరులోని టీడీయూ హెల్త్‌సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి పరిశోధనలు కొనసాగించారు. యాంటీబయాటిక్స్ తదితర రసాయన ఔషధాలపై ఆధారపడకుండా తమ ఇంట్లోని దినుసులతోనే పశువ్యాధులకు రైతులే స్వయంగా చికిత్స చేసుకోవటానికి వీలుగా ఉండటం ఈవీఎంల ప్రత్యేకత. సిద్ధ వైద్య సూత్రాల ఆధారంగా సుమారు 50కి పైగా పశు వ్యాధులకు ఈవీఎం పద్ధతులను ఆయన రూపొందించారు. వీటి పనితీరును నిర్ధారించుకున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా పశుపోషకులకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సిఫారసు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసింది. సంబంధిత చికిత్సల వీడియోలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్డీడీబీ యూట్యూబ్ చానల్లో అందుబాటులో ఉన్నాయి.
స్వచ్ఛమైన పాలు, గుడ్లు, పేడ, మూత్రం ఉత్పత్తే లక్ష్యం: డా. పుణ్యమూర్తి
‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు.

Tags : 1