సాఫ్ట్‌వేర్ బూమ్ మళ్లీ వస్తుందా?

Published on Mon, 02/02/2026 - 16:11

దేశంలో 90ల నాటి సాఫ్ట్‌వేర్ బూమ్ మళ్లీ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ మార్కెట్ వేత్త, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్.  కేంద్ర బడ్జెట్ 2026ను ఆయన “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు మాస్టర్ స్ట్రోక్”గా అభివర్ణించారు. 2047 వరకు డేటా సెంటర్లకు 100% ట్యాక్స్‌ హాలిడే (పన్ను రహితం) అందించే విధాన నిర్ణయాన్ని ఆయన “1,000 పౌండ్ల గొరిల్లా” (అత్యంత శక్తివంతమైన) తరహా నిర్ణయంగా పేర్కొన్నారు.

ప్రస్తుత డిజిటల్‌ పురోగతిని 1990ల సాఫ్ట్‌వేర్ బూమ్‌తో పోలుస్తూ.. “మనం ఇప్పటికే ఏఐ(AI)ని స్వీకరించాం. ఇప్పుడు ‘ఏఐ ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్’ను నిర్మిస్తున్నాం. విద్యుత్, కేబుల్స్, మౌలిక సదుపాయాల్లో భారీ మూలధనం పెట్టుబడి పెడుతున్నాం” అని రామ్‌దేవ్‌ అగర్వాల్ తెలిపారు.

మరోవైపు కేంద్ర బడ్జెట్ 2026లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరగడం వల్ల సమీప కాలంలో మార్కెట్లకు హెడ్‌విండ్స్ ఉన్నాయని అంగీకరించారు. అయితే దేశ దీర్ఘకాలిక ఆదాయ కథ బలంగా కొనసాగుతోందని రామ్‌దేవ్‌ అగర్వాల్ స్పష్టం చేశారు. “4.3% ద్రవ్యలోటు లక్ష్యం, రూ.12.2 లక్షల కోట్ల క్యాపెక్స్ పుష్‌తో, దీర్ఘకాలంలో భారతదేశమే నిజమైన విజేత” అని ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఫ్యూచర్స్‌పై ఎస్‌టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10% నుంచి 0.15%కి పెరిగింది. అలాగే  ఆప్షన్ ఎక్సర్సైజ్‌పై పన్ను 0.125% నుంచి 0.15 శాతానికి ఎగిసింది. ఈ చర్యలు స్వల్పకాలిక ట్రేడింగ్ కార్యకలాపాలను తగ్గించవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

ఇది  చదివారా? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కొత్త కండీషన్‌

బడ్జెట్‌లోని సూక్ష్మ అంశాలు కూడా అంతే ప్రాధాన్యత కలవని ఆయన అన్నారు. ఐటీ సేవల నిర్వచనాన్ని విస్తరించడం వల్ల గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు (GCC) బదిలీ ధరలపై స్పష్టత లభించిందని, ఇది హైఎండ్ టెక్నాలజీ వ్యాపారాలకు భారత్ స్వాగతం పలుకుతోందనే బలమైన సంకేతం  అని పేర్కొన్నారు.

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)