50 మంది సెలబ్రిటీలతో కొత్త రియాలిటీ షో..

Published on Mon, 02/02/2026 - 15:44

మన దేశంలో రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. సినిమాల్లో, టీవీలో, సోషల్‌ మీడియాలో కనిపించే సెలబ్రిటీలు రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెలుసుకోవాలని అభిమానులు తెగ తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం ఎన్నో గేమ్‌ షోలు, రియాలిటీ షోలు పుట్టుకొచ్చాయి. తాజాగా ద 50 గేమ్‌ షో మొదలైంది. అసలు ఆ షో ఏంటి? దాని స్పెషాలింటీ ఏంటి? అన్నది ఓసారి చూసేద్దాం..

50 మంది సెలబ్రిటీలు
బిగ్‌బాస్‌ షోలో 20 మందికి అటుఇటుగా సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపిస్తారు. వందరోజులపాటు టాస్కులు, గేమ్స్‌ ఇస్తారు. చివర్లో ఒకరిని విజేతగా ప్రకటించి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ద 50 షో కూడా ఇంచుమించు ఇలాంటిదే! కాకపోతే ఇక్కడ సెలబ్రిటీలు పది మందో ఇరవైమందో కాదు, ఏకంగా 50 మంది ఉన్నారు. వీళ్లందర్నీ ఒక పెద్ద రాజభవనంలాంటి మహల్‌లో ఉంచుతారు. దీన్నే లయన్‌ హౌస్‌ అంటారు.

ప్రైజ్‌మనీ ఎవరికంటే?
సమయానుసారం టాస్కులు ఆడిస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు ఎలిమినేషన్స్‌ కూడా ఉంటాయి. ఎప్పుడుపడితే అప్పుడు ఎందుకంటే ద 50 అనేది కేవలం యాభై రోజుల గేమ్‌ షో. మరి అన్నీ దాటుకుని చివరిదాకా వచ్చినవారికేమైనా ఉంటుందా? అంటే ఇప్పటికైతే అలాంటి ప్రైజ్‌మనీ ఏమీ ప్రకటించలేదు. కాకపోతే ఎవరు గెలుస్తారో గెస్‌ చేసిన అభిమాని/ ప్రేక్షకులకు మాత్రం ప్రైజ్‌మనీ దక్కుతుంది. అది కూడా అక్షరాలా రూ.50 లక్షల రూపాయలు.

నో హోస్ట్‌
లెస్‌ సింక్వాంటె (సింక్వాంటె అంటే 50 అని అర్థం) అనే ఫ్రెంచ్‌ షో ఆధారంగా 'ద 50' రియాలిటీ షోని డిజైన్‌ చేశారు. అయితే మాతృకలో ఉన్న అనేక నిబంధనలను ఇక్కడ కాస్త సడలించారు. ఈ షోకి హోస్ట్‌ అంటూ ఎవరూ ఉండరు. బిగ్‌బాస్‌లో ఎలాగైతే కనిపించని వ్యక్తి ఆదేశాలు ఇస్తాడో.. ఇక్కడ కూడా సింహం మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తి కంటెస్టెంట్లతో గేమ్స్‌ ఆడిస్తాడు, ఛాలెంజ్‌లు విసురుతాడు, ఎలిమినేట్‌ చేస్తాడు. ఫిబ్రవరి 1న ఈ షో మొదలైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియోహాట్‌స్టార్‌లో రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుండగా.. కలర్స్‌ టీవీలో రాత్రి 10.30కి ప్రసారమవుతోంది.

కంటెస్టెంట్లు వీళ్లే..
తేజస్వి మదివాడ (తెలుగమ్మాయి), కరణ్‌ పటేల్‌, ఊర్వశి ఢోలకియా, రజత్‌ దలాల్‌, మిస్టర్‌ ఫైజు, దివ్య అగర్వాల్‌, మోనాలిసా, విక్రాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శినీ దోశి, రిది డోగ్రా, దుశ్యంత్‌ కుక్రేజా, శివ్‌ ఠాక్రే, నీలం గిరి, చాహత్‌ పాండే, హమీద్‌ బర్క్‌జీ, డింపాల్‌ సింగ్‌, మాక్స్‌టర్న్‌, సుమైరా షైఖ్‌, లవ్‌కేశ్‌ కటారియా, సివెత్‌ తోమర్‌, నేహాల్‌ చుదసమ, కృష్ణ ష్రాఫ్‌, సప్న చౌదరి, నిక్కీ తంబోలి, అర్బాజ్‌ పటేల్‌, వన్హాజ్‌ సింగ్‌, ప్రిన్స్‌ నరౌలా, యువికా చౌదరి, అర్చనా గౌతమ్‌,  బేబికా ధుర్వె, జాన్వీ కిల్లెకర్‌, యంగ్‌ సామీ, అద్నాన్‌ షైఖ్‌, లక్షయ్‌ కౌశిక్‌, అర్చిత్‌ కౌశిక్‌, దిగ్విజయ్‌ రాతే, నటాలియా జన్జోజ్‌సెక్‌, ఖన్జాదీ, ఫైజ్‌ బలోచ్‌, రచిత్‌ రోజా, సిద్దార్థ్‌ భరద్వాజ్‌, డినో జేమ్స్‌, ఆర్య జదావో, సౌరభ్‌ గాడ్గె, మనీషా రాని, ఆరుశి చావ్లా, రిద్దిమా పండిట్‌, శ్రుతికా అర్జున్‌, భవ్య సింగ్‌, ఇమ్మోర్టల్‌ కాక.. పార్టిసిపెంట్లుగా లయన్‌ హౌస్‌లో అడుగుపెట్టారు.

 

 

చదవండి: ఎక్కువ పారితోషికం.. సినిమాను నాశనం చేస్తున్నారు: నటుడు

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)