ఏడు తరాలు గుర్తుండిపోతుంది: నవీన్‌ పొలిశెట్టి

Published on Sun, 02/01/2026 - 00:05

'‘నిర్మాత నాగవంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తాడు. సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత మంచి విజయం వస్తుందని మాలాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. మూవీ కోసం నవీన్‌ పొలిశెట్టి ప్రాణం పెడతాడు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ‘అనగ నగా ఒక రాజు’’ అని నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్‌ ‘దిల్‌’ రాజు చెప్పారు. 

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవానికి ‘దిల్‌’ రాజు, దర్శకుడు బాబీ కొల్లి అతిథులుగా హాజరయ్యారు.

బాబీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల నేను చిరంజీవిగారిని కలిసినప్పుడు... ‘అనగనగా ఒక రాజు’ బాగుందట కదా... ఈ తరంలో నాకు బాగా నచ్చిన హీరో నవీన్‌’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతి మా యూనిట్‌కి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది’’ అని నవీన్‌ పొలిశెట్టి చెప్పారు. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశామనడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయడం చూసి మా కష్టమంతా మర్చిపోయాను’’ అని మారి తెలిపారు. మీనాక్షీ చౌదరి, రచయిత్రి, క్రియేటివ్‌ డైరెక్టర్‌ చిన్మయి, రచయిత చంద్రబోస్‌ మాట్లాడారు.

Videos

10 గంటలు.. 2000 మంది.. ప్రధానికి కంప్లైంట్ ఇస్తే..! అడ్వకేట్ సంచలన నిజాలు

అంబటిని ఏం చేయాలో..! లోకేష్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్

పార్టీ అండగా ఉంటుంది.. ఫోన్ లో జగన్ భరోసా!!

గల్లా మాధవి భర్త అంబటిని హత్య చేయాలని..! ఇవిగో ఆధారాలు

అర్ధరాత్రి 11 గంటలకు అంబటి అక్రమ అరెస్ట్

సుత్తులతో గోడలు బద్దలు కొడుతూ అంబటి ఆఫీసుకు నిప్పు

మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందం.. ఉపాసనకు ట్విన్స్ (ఫోటోలు)

EXCLUSIVE Video: 2000 మంది గూటీడీపీలతో ఎమ్మెల్యే గల్లా మాధవి విధ్వంసం

Guntur: అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి కారు.. ఫర్నీచర్ ధ్వంసం

పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నం

Photos

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంద‌డి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)