CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
Breaking News
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
Published on Fri, 01/30/2026 - 16:20
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.
హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.
ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.
వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.
బంగారం ధరలపై విలియం లీ స్పందన
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.
పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!
Tags : 1