Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు
Breaking News
నేను కాదు, ఆమే నన్ను వదిలేసింది: విజయ్ కార్తిక్ ఎమోషనల్ వీడియో
Published on Thu, 01/29/2026 - 12:04
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్, హీరో విజయ్ కార్తిక్ విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. రెండేళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంతా భావిస్తే.. విడిపోయిన విషయాన్ని చెప్పి షాకిచ్చింది కీర్తి. ‘విజయ్‌ని నేను భర్తగా చూడలేకపోతున్నా. మా బంధాన్ని స్నేహం వరకు పరిమితం చేయాలని భావిస్తున్నా’ అంటూ బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో పలువురు నెటిజన్లు విజయ్ కార్తీక్‌ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఎంతో కష్టాలను అనుభవించి.. ఈ స్థాయికి వచ్చిన కీర్తిని వదిలేయడం కరెక్ట్ కాదంటూ విజయ్‌ని ట్రోల్ చేశారు. దీంతో తాజాగా ఈ విషయంపై విజయ్ స్పందిస్తూ.. షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను కీర్తిని వదిలేయలేదని.. ఆమే తనను వదిలేసిందని చెప్పాడు. ఆర్థికంగా స్థిరపడలేదనే కారణంతోనే ఆమె బ్రేకప్ చెప్పిందన్నాడు. ఈ మేరకు బ్రేకప్ ఇష్యూపై స్పందిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

‘హాయ్ అండీ..ఈ వీడియో చేయాలని అస్సలు అనుకోలేదు. కానీ నిన్న ఈవినింగ్ కీర్తి గారు పోస్ట్ పెట్టిన తరువాత చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి మీరు కీర్తి గారిని వదిలేయకుండీ.. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి అని చాలామంది కంటిన్యూగా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నాం.. ఫ్రెండ్స్ ఉంటాం అని కీర్తి మెసేజ్ చేయడంతో..అంతా నాకు కాల్స్ చేస్తున్నారు. విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటాను
(చదవండి: హీరోతో ఎంగేజ్మెంట్.. రిలేషన్‌షిప్‌కు బుల్లితెర నటి ఎండ్ కార్డ్..!)
అది నా నిర్ణయం కాదు.. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం. నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కాలేదనే స్ట్రాంగ్ రీజన్ ఆమెకి అనిపించింది. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తను డిసెంబర్లోనే నాకు ఈ మాట చెప్పి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఆమె జీవితం కాబట్టి.. ఆమె నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఆమెకి ఆ హక్కు ఉంది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను చాలా వరకూ ఆమెను కన్విన్స్ చేశాను. కేవలం డబ్బులు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశాను.

కానీ ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. నేను కాంప్రమైజ్ అయ్యి బతకడం ఇష్టం లేదని చెప్పింది. తనకి ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని నాకు క్లియర్‌గా చెప్పింది. అందుకే నన్ను వదిలేసింది. అతనితోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె నాకు ఆల్రెడీ డిసెంబర్లోనే చెప్పారు. ఆమె నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా కన్విన్స్ చేయడానికి చూశాను. వదిలేయొద్దు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. కానీ ఆమె నిర్ణయం తీసుకునే నాకు చెప్పింది. కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఆమె చాలా స్ట్రాంగ్ నిర్ఱయం తీసుకుని వచ్చి నాతో డిస్కస్ చేశారు.
ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఫోర్స్‌ఫుల్‌గా ప్రేమను పొందలేం. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్వెన్స్ చేయడానికి చూశాం. ఆమె వినే పరిస్థితిలో లేదు.. మా ప్రయత్నాలు ఫలించలేదు. జరిగింది జరిగిపోయింది.. కాబట్టి.. ఆమె, వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆమె ఫొటోలు డిలీట్ చేసింది కదా.. మీరెందుకు డిలీట్ చేయడం లేదు అని అడుగుతున్నారు
కానీ ఒక పోస్ట్ పెట్టడం అనేది చాలా ఈజీ. కానీ ఆ పోస్ట్ పెట్టడం వెనుక చాలా ఎమోషన్ ఉంటుంది. నాకు ఆ పెయిన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఆ పోస్ట్‌లు, పొటోలు డిలీట్ చేస్తాను. నాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్లందరికీ థాంక్స్. నేను కూడా ఇంత షార్ట్ టైమ్‌లో మా రిలేషన్ ఎండ్ అవుతుందని ఊహించలేదు. దేవుడు ఇలా రాసిపెట్టి ఉన్నప్పుడు ఏం చేయలేం.
దయచేసి అందరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. పీఆర్ టీమ్‌కు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే.. డబ్బులు ఇస్తున్నారు కదా అని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి. కామెంట్ పెట్టే ముందుకు దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీకు కూడా ఒక లైఫ్ ఉంటుంది. మీ జీవితంలోనూ అలా జరిగితే.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుతంది. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయకండి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు. నాకు సపోర్ట్ చేసినవాళ్లందరికి ధ్యాంక్స్’ అని కార్తిక్ చెప్పుకొచ్చాడు.
Tags : 1