Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..
Breaking News
కార్తీ సినిమా ఫైనల్ కలెక్షన్స్.. ఎవరూ ఊహించలేరు
Published on Thu, 01/29/2026 - 09:26
కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది . సంక్రాంతి కానుకగా తమిళ్‌లో 'వా వాత్తియార్' పేరుతో జనవరి 14న విడుదలైంది. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి కూడా ఈ మూవీ జనవరి 28న వచ్చేసింది. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ కలెక్షన్స్ అని తెలుస్తోంది. కార్తీ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'అన్నగారు వస్తారు' నిలిచింది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించి ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది.

'అన్నగారు వస్తారు' (వా వాతియార్) భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పనితీరు చాలా దారుణంగా ఉంది. యాక్షన్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం కేవలం రూ. 9 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 40 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో ఈ మూవీ ఉన్నప్పటికీ పెద్దగా రిటర్న్ చేయలేదు. కార్తీ వంటి స్టార్ హీరోకు ఇలాంటి కలెక్షన్స్ రావడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. వారంలోనే ఈ మూవీని తమిళనాడు వ్యాప్తంగా తొలగించేశారు. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శన కారణంగా, నష్టాలను తగ్గించడానికి వా వాతియార్ నిర్మాతలు త్వరగా డిజిటల్ విడుదలను చేశారని తెలుస్తోంది. ఓటీటీ ద్వారా కాస్త నష్టాలను తగ్గించుకునే పనిలో నిర్మాతలు విజయం సాధించారు.
Tags : 1