Breaking News

ఆ హీరోతో సినిమా.. సమంత ఓకే చెబుతుందా?

Published on Mon, 01/26/2026 - 07:01

కోలివుడ్‌లో సంచలన కథానాయకుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. మంచి విజయాన్ని అందుకుని చాలాకాలమైంనే చెప్పాలి. ఇటీవల కమలహాసన్‌తో కలసి నటించిన థగ్స్‌ లైఫ్‌ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  నిర్మాణంలో ఉంది. వి.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరసన్‌ అనే టైటిల్‌  ఖరారు చేశారు. ఇది ఉత్తర చెన్నై యూనివర్సల్‌లో సాగే ఒక కథతో రూపొందుతున్న చిత్రమని యూనిట్‌ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. 

కాగా మదురైకి చెందిన ఒక సాధారణ కబడ్డీ క్రీడాకారుడు అనూహ్య పరిస్థితుల్లో చెన్నైకి రావడం, ఆ తర్వాత అక్కడ ఒక డానుగా మారడం వంటి కథాంశంతో సాగే చిత్రం అరసన్‌ అని సమాచారం. దర్శకుడు వెట్రిమారన్, శింబు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది కావడం గమనార్హం. ఇందులో శింబు యువకుడిగా, మధ్య వయసు్కడిగాను రెండు గెటప్పుల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను విజయ్‌ సేతుపతి పోషించనున్నారు. దీంతో ఇది మల్టీ స్టారర్‌ చిత్రంగా మారుతోంది. 

తాజాగా ఈ చిత్రంలో శింబుకు జంటగా సమంతను కథానాయకిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. సమంతతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే శింబు, సమంత కలసి నటించే తొలి చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇంతకుముందు విజయ్, సూర్య, విజయ్‌ సేతుపతి, వంటి స్టార్‌ హీరోల సరసన నటించిన సమంత తమిళంలో నటించి కూడా చాలాకాలమైంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం అవుతుందని సమాచారం.  

Videos

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

సొమ్మొకడిది సోకొకడిది.. తండ్రీకొడుకుల భజన చూసి నవ్వుతున్న నెటిజన్లు

11 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు

మోత మోగిస్తున్న వెండి.. భయపెడుతున్న బంగారం

100 కోట్ల భూమిపై కన్నేసిన టీడీపీ నేత

థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!

Photos

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)