జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
హైకోర్టును ఆశ్రయించిన 'పవన్' కుమారుడు అకీరా నందన్
Published on Sat, 01/24/2026 - 13:25
సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు కథనాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాయంతో పలు వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ సాంకేతికతతో క్రియేట్ చేసిన కంటెంట్‌ను వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో ఇలాంటి ఈ అంశంపై పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, సునీల్ గావస్కర్ వంటి స్టార్స్ ఉన్నారు. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల పాటు ఒక వీడియోను క్రియేట్ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారంటూ పవన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ తీసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫ్యాన్స్ ఫిర్యాదు చేశారు.
Tags : 1