జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
డేటింగ్‌లో ఉన్నా.. కానీ, తను ముస్లిం కాదు: ఫరియా అబ్దుల్లా
Published on Thu, 01/22/2026 - 09:08
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్‌కు దగ్గరైన బ్యూటీ ఫరియా అబ్దుల్లా .. రీసెంట్‌గా గుర్రంపాపిరెడ్డి మూవీతో పాటు అనగనగా ఒక రాజులో ప్రత్యేక పాత్రలో మెరిసింది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది.
ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. తన ప్రియుడి గురించి మాట్లాడుతూ.. అతడు ముస్లిం కాదని, హిందూ కుటంబానికి చెందిన యువకుడని స్పష్టం చేసింది. అందరూ అనుకుంటున్నట్లు అతడు తన బాల్య స్నేహితుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయితే, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనంటూ క్లూ ఇచ్చింది. అతను ఒక కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడని చెప్పింది. తాము ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఒక టీమ్‌లా ముందుకు వెళ్తున్నట్లు మాట్లాడింది. కొంత కాలంగా తనలోని డ్యాన్స్, ర్యాప్‌లో వచ్చిన మార్పులకు అతనే కారణమని ఫరియా గుర్తుచేసుకుంది. తమ మధ్య ఉండే బంధం లవ్ అఫైర్ కాదని అదొక అనుబంధం అంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి చెప్పింది.
Tags : 1