Breaking News

సినిమా ఫ్లాప్‌.. ప్రభాస్‌ రియాక్షన్‌ చెప్పిన నిధి అగర్వాల్‌

Published on Wed, 01/21/2026 - 13:00

చాలామంది హిట్టు కొట్టగానే సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు, ఫ్లాప్‌ రాగానే ఒక్కసారిగా డీలా పడిపోతారు. అయితే ఈ జయాపజయాలను ప్రభాస్‌ అస్సలు లెక్క చేయడంటోంది హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. ప్రభాస్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ "ది రాజాసాబ్‌". ఇందులో నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటించారు. 

చతికిలపడ్డ రాజాసాబ్‌
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అన్నింటికంటే ముందుగా దిగింది. భారీ అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. నెగెటివ్‌ టాక్‌ వల్ల మంచి కలెక్షన్స్‌ రాబట్టలేపోయింది. అయితే ప్రభాస్‌ వీటినేవీ పట్టించుకోడంటోంది నిధి అగర్వాల్‌.

తలదూర్చడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడు. తన పనేదో తను చేసుకుపోతాడు. ఫేక్‌గా ఉండలేడు. చాలా మంచి వ్యక్తి. ఆయనంత హుందాగా నేను ఉండగలనా? అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ, ఆయనతో కలిసి పని చేశాక మరో విషయం అర్థమైంది. తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడు.

ప్రభాస్‌ను కలిస్తే..
ఎవరైనా సరే.. ఆయన్ను కలిసినప్పుడు తను ఓ స్టార్‌ హీరో అన్న విషయమే మర్చిపోతారు. ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటాడు. దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్‌ టీమ్‌ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్‌ గురించి అసలు పట్టించుకోడు అని నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. 

చదవండి: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్‌.. ట్రోలింగ్‌ పట్టించుకోనంటున్న బ్యూటీ

Videos

యూపీలో విమాన ప్రమాదం

రావణకాష్టంగా పిన్నెల్లి.. పల్నాడులో పడగెత్తిన ఫ్యాక్షన్

చేతకాని సీఎం రేవంత్ వల్లే.. అన్నదాతల ఆత్మహత్యలు

చిక్కుల్లో చంద్రబాబు.. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం..

వైఎస్ జగన్ ను కలిసిన మందా సాల్మన్ కుటుంబ సభ్యులు

ట్రంప్ విమానానికి తప్పిన ప్రమాదం.. అసలేమైందంటే..?

లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ!

కొంచమైనా నిజాయితీ ఉంటే.. కూటమి ప్రభుత్వ అవినీతి పాలనపై కేకే రాజు

బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్

కంపెనీ ఇక్కడ పెట్టి ఉద్యోగాలు ఎవరికో ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు

Photos

+5

'చీకటిలో' ప్రీమియర్స్.. భర్తతో కలిసి శోభిత సందడి (ఫొటోలు)

+5

'భర్త మహాశయులకు..' ఫేమ్ ఆషికా రంగనాథ్ సుకుమారంగా (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన ఈ రంగనాధస్వామి ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)

+5

రెండో ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో పూర్ణ పోజులు (ఫొటోలు)

+5

రేవంత్‌ టీంలో చిరంజీవి.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్‌ సందడి (చిత్రాలు)

+5

హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో హీరోయిన్ అసిన్ (ఫొటోలు)

+5

గ్లామరస్ అను ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు ఏం చేస్తోంది? (ఫొటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ బర్త్ డే సెలబ్రేషన్స్...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

సీతాకల్యాణం చేసిన 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)