రావణకాష్టంగా పిన్నెల్లి.. పల్నాడులో పడగెత్తిన ఫ్యాక్షన్
Breaking News
శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్
Published on Wed, 01/21/2026 - 10:35
గత రెండు రోజులుగా వార్తల్లో నిలిచిన నటి రేణు దేశాయ్.. ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేసింది. పలువురు యూట్యూబర్లకు శాపాలు పెట్టింది. మీ డబ్బుకు శాపం తగులుతుంది. కచ్చితంగా బాధపడతారు అని చెప్పి రాసుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది?
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రెస్ మీట్ పెట్టిన ఈమె.. అన్యాయంగా వీధి కుక్కల్ని చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కార్యక్రమంలోనే ఓ సీనియర్ జర్నలిస్టుపైనా విరుచుకుపడింది. ఐదు కుక్కలు కరిస్తే అన్ని కుక్కల్ని చంపేస్తారా? మగాళ్లు అత్యాచారం చేస్తే అందరు మగాళ్లని చంపేయాలా? మీకు ఏమైనా బుద్ధుందా అని రెచ్చిపోయింది.
(ఇదీ చదవండి: రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. నన్ను కాపాడటానికి ఎవరూ లేరు)
ఇక మంగళవారం కాశీకి వెళ్లిన ఈమె.. తనకు తల్లిదండ్రులు, సోదరులు, భర్త ఎవరూ లేరని, తాను ఒంటరిదాన్ని అని చెప్పి మరో సంచలన పోస్ట్ పెట్టింది. తప్పు లేకపోయినా నన్ను ఎంతోమంది విమర్శిస్తున్నారు. మీరు చేసే కామెంట్స్‌పై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధ చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటున్నాడనే నమ్మకం నాకు ఉంది అని చెప్పుకొచ్చింది.
ఇప్పుడేమో తన వీడియోలని ఉపయోగించిన పలువురు యూట్యూబర్లకు శాపాలు పెట్టింది. 'గత రెండు రోజుల నుంచి నా పేరు చెప్పి మీరు వీడియోలు చేస్తున్నారు. యూట్యూబ్‌లో సంపాదించుకున్నారు. ఆ డబ్బుకు శాపం తగులుతుంది. మీరు కచ్చితంగా బాధపడతారు. బుద్ధి తక్కువ ఉంటే ఒరిజినల్ కంటెంట్ రాదు. వీధిలో ముసలివాళ్లలా పాడ్‌కాస్ట్‌లు చేస్తూ స్టుపిడ్ గాసిప్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిజినెస్ పర్సన్స్ మాయమైపోతే.. మీరు ఎవరిపై వీడియోలు చేస్తారు? డబ్బులెలా సంపాదిస్తారు? సొంతంగా మీకు టాలెంట్ లేదు. ఉన్నదల్లా వెటకారం, వ్యంగం, నాన్సెన్స్ మాత్రమే' అని రేణు దేశాయ్ రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)
Tags : 1