Breaking News

అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను కూడా చంపేస్తారా?.. యాంకర్ రష్మీ గౌతమ్

Published on Mon, 01/19/2026 - 16:28

టాలీవుడ్ యాంకర్ రష్మీ సైతం కుక్కల సంరక్షణపై మాట్లాడారు. ఇవాళ ప్రెస్‌క్లబ్‌లో ఆమె పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు మిగిలిన ఆహారాన్ని బయట కుక్కలకు పెట్టేవారని తెలిపింది. ఆ సంప్రదాయాలన్నీ మేము మర్చిపోయామని వెల్లడించింది. ఒకప్పుడు ఆవు అనే మన కుటుంబంలో సభ్యురాలిగా ఉండేదని పేర్కొంది. ఇ‍ప్పుడు ఆవుపాలను కూడా కల్తీ చేశామని వాపోయింది.

జున్ను పాలు అనేది ఆవు బిడ్డకే అందించాలి.. కానీ మనం మాత్రం జున్ను తింటున్నామని రష్మీ గౌతమ్ తెలిపింది. అది తిన్నా కూడా అరగదని వెల్లడించింది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో లెటర్స్ పంపడానికి పావురాలు పెంచుకున్నారు.. కానీ ఇప్పుడేమో ‍అవసరం లేదని చంపేయండి అంటున్నారు. కుక్కలంటే ఒకప్పుడు డ్రైనేజీలో ఉండే ఎలుకలను తినేవి.. అప్పుడు ఎకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేదని తెలిపింది. డీ ఫారేస్టేషన్ వల్ల జింకలు కూడా రోడ్లమీదకు వస్తున్నాయని పేర్కొంది.  పావురాలు , కుక్కలతో అవసరం లేదని వాటిని చంపుకుంటూ వెళ్తారా?.. అలాగే భవిష్యత్‌లో తల్లిదండ్రులు కూడా అడ్డంకిగా ఉన్నారని చంపేస్తారా? అంటూ రష్మీ ప్రశ్నించింది.

ఇదంతా కేవలం కుక్కల గురించి మాత్రమే కాదని రష్మీ గౌతమ్ వెల్లడించింది. ఇదంతా సోషల్ కండీషనింగ్‌ అని తెలిపింది. మేము ఫారిన్ బ్రీడ్స్‌కు బానిసలా తయారయ్యామని యాంకర్ వివరించింది. 
 

Videos

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు

చలో విజయవాడ.. మేమేంటో చూపిస్తాం

ఏపీలో పేకాటలపై కారుమూరి ఫైర్

BRS నాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ PA దాడి

Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా

Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

Photos

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)